
త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో ఖాళీ అయిన నాలుగు స్ధానాలకు గాను మూడు టీడీపీ తీసుకుని, ఒక స్ధానం జనసేనకు (Janasena) ఇచ్చింది. దీంతో జనసేన ఇవాళ తమ రాజ్యసభ అభ్యర్దిగా లింగమనేని రమేశ్ (Lingamaneni
త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీలో ఖాళీ అయిన నాలుగు స్ధానాలకు గాను మూడు టీడీపీ తీసుకుని, ఒక స్ధానం జనసేనకు (Janasena) ఇచ్చింది. దీంతో జనసేన ఇవాళ తమ రాజ్యసభ అభ్యర్దిగా లింగమనేని రమేశ్ (Lingamaneni Ramesh) ను ఎంపిక చేసింది. ఈ మేరకు సాయంత్రం జనసేన అధికారికంగా ఓ ప్రకటన చేసింది. ఇందులో లింగమనేని ఎంపిక వెనుక ఉన్న కారణాలను, అలాగే పార్టీతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని కూడా వెల్లడించింది.మోడీ కేబినెట్ నుంచి ఇద్దరు అవుట్ ? విస్తరణకు ముందే షాక్..!జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారని పార్టీ ఓ ప్రకటన చేసింది. ఈ మేరకు సాయంత్రం పవన్ కల్యాణ్ రమేష్ పేరును ప్రకటించారని తెలిపింది. జనసేన పార్టీతో, పవన్ కళ్యాణ్ తో 2015 నుంచి రమేష్ కి అనుబంధం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత, అందుకు తగ్గ సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆలోచనలకు ఆకర్షితులైన రమేష్, ఆయన వెన్నంటి ఉన్నారని వెల్లడించింది.రాజ్యసభ లెక్క మార్చే ఎన్నికలు-క్రాస్ ఓటింగ్ లో కాంగ్రెస్..! మెజార్టీ దిశగా ఎన్డీయే..!రేపు మధ్యాహ్నం రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేస్తారని కూడా జనసేన ప్రకటనలో తెలిపారు. అలాగే 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా జనసేన సిద్ధాంతాలపైనా, పార్టీ అధ్యక్షుడుగా పవన్ కళ్యాణ్ పైనా విశ్వాసం కనపరచి, ఎన్ని ఒత్తిళ్ళు, సవాళ్ళు ఎదురైనా సహనంతో నిలిచిన వారికి నామినేటెడ్ పదవుల్లో కుల, మతాలు పరిగణనలోకి తీసుకోకుండా అవకాశం కల్పించారని, ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థి ఎంపికలోనూ పవన్ కళ్యాణ్ పరిగణనలోకి తీసుకున్నారని జనసేన వర్గాలు తెలిపాయి.