
గురుగ్రామ్: హరియాణాలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వేళ భార్య ఫోన్లో మాట్లాడటం చూసిన భర్త.. ఆ ఫోన్‌ను తనకు ఇవ్వడానికి నిరాకరించడం, ఆపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు
గురుగ్రామ్: హరియాణాలోని గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి వేళ భార్య ఫోన్లో మాట్లాడటం చూసిన భర్త.. ఆ ఫోన్‌ను తనకు ఇవ్వడానికి నిరాకరించడం, ఆపై అనుమానంతో ఆమెను హత్య చేశాడు. స్కార్ఫ్‌తో గొంతు నులిమి చంపేసి అక్కడి నుంచి పరారై.. చివరకు పోలీసులకు చిక్కాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరేంద్ర సింగ్ (37), కాజల్ దేవి (36) దంపతులకు నలుగురు పిల్లలు. వీరిద్దరూ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. భార్య రోజూ 8గంటలకే ఇంటికి వచ్చేయగా.. నిందితుడు మాత్రం అర్ధరాత్రి వేళ వస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడటం చూసి ఆగ్రహించాడు. ఆ ఫోన్ తనకు ఇవ్వాలని అడగ్గా.. అందుకు నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహం, అనుమానంతో రగిలిపోయి కాజల్‌ను స్కార్ఫ్‌తో గొంతునులిమి చంపి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో నలుగురు పిల్లలు ఇంటి మేడపై నిద్రపోతున్నారని పోలీసులు వివరించారు. మృతురాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడిది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాగా గుర్తించారు. భార్యను చంపేందుకు నరేంద్రసింగ్ ఉపయోగించిన స్కార్ఫ్‌ను స్వాధీనం చేసుకొని అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.