
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వరుసగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇస్తూ రాకెట్ వేగంతో రాజధానిని అభివృద్ధి చేస్తోంది. తాజాగా
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వరుసగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇస్తూ రాకెట్ వేగంతో రాజధానిని అభివృద్ధి చేస్తోంది. తాజాగా మరికొన్ని పనులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వరుసగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులు ఇస్తూ రాకెట్ వేగంతో రాజధానిని అభివృద్ధి చేస్తోంది. తాజాగా మరికొన్ని పనులకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి ఐ, ఐఏఎస్ బంగ్లాల అదనపు పనులు, ఏపీ హైకోర్టు భవన అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు సర్కార్ పచ్చజెండా ఊపింది.
'అమరావతి ఐ' ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృష్ణా నదీ తీరంలో భారీ ఫెర్రీస్ వీల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. DBFOT విధానంలో ఈ 'అమరావతి ఐ' ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ఇందుకు పోటీ టెండర్లు, ఆర్ఎఫ్పీ కోసం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు 30 ఏళ్ల లీజ్‌పై 6 ఎకరాల భూమి కేటాయించింది. పీపీపీ మోడ్‌లో 'అమరావతి ఐ' నిర్మాణం జరగనుంది. దీని అమలు బాధ్యతలను అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతిలో ఐఏఎస్ బంగ్లాల అదనపు పనులకు ఏపీ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాయపూడి దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ, సెక్రటరీ స్థాయి అధికారుల బంగ్లాల్లో అదనపు వసతుల కల్పనకు అనుమతులు ఇచ్చింది. హోమ్ ఆటోమేషన్ సిస్టమ్‌లు, అదనపు వార్డ్రోబ్లు, జ్యూస్ కౌంటర్ల ఏర్పాటుకూ ఓకే చెప్పింది. బంగ్లాల్లో స్పైరల్ స్టెయిర్‌కేస్, కార్ పార్కింగ్ షెడ్, హీట్ పంప్‌లు, టెన్సైల్ రూఫింగ్ పనులకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు రూ.94.90 కోట్ల వ్యయంతో అదనపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ హైకోర్టు భవన అభివృద్ధి పనులకు చంద్రబాబు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు హైకోర్టు భవనం వెలుపల అభివృద్ధి, ఇతర పనులకు రూ.547 కోట్ల నిధులు మంజూరు చేసింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా, సూపర్ బ్లాక్ 'F'లో మౌలిక వసతుల కల్పన, హైకోర్టు రూఫ్‌టాప్ ఎలివేషన్లలో ప్రీకాస్ట్ ఫిన్స్ డిజైన్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు జారీ చేసింది. భవన పరిధిలో పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, జలవనరులు (వాటర్‌బాడీస్) ఏర్పాటుకు నిధులు కేటాయించింది. అంతర్గత రహదారులు, సబ్‌స్టేషన్, జడ్జిల డ్రాప్-ఆఫ్ పాయింట్ల నిర్మాణానికీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. డిజైన్-బిల్డ్ లంప్సమ్ కాంట్రాక్ట్ (పర్సంటేజ్ టెండర్) విధానంలో టెండర్ల ప్రక్రియకు ఆదేశాలు జారీ చేసింది.
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్