
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జడ్చర్ల సభ వేదికపై నుంచి నిప్పులు చెరిగారు. నీ పదేళ్ల పాలన.. నా రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అంటూ కేసీఆర్కు
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జడ్చర్ల సభ వేదికపై నుంచి నిప్పులు చెరిగారు. నీ పదేళ్ల పాలన.. నా రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు.
జడ్చర్ల, జూన్05: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జడ్చర్ల సభ వేదికపై నుంచి నిప్పులు చెరిగారు. నీ పదేళ్ల పాలన.. నా రెండున్నరేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అంటూ కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. నీ పేరు కేసీఆర్ అయితే చర్చకు రా.. ఈ చర్చలో ఓడితే తాను దేనికైనా సిద్ధమని కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిన చోట మీరు ఓట్లు అడగండని కేసీఆర్కు సీఎం రేవంత్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టిన దగ్గర మేం ఓట్లు అడుగుతామన్నారు. మీకు డిపాజిట్లు వస్తే.. నా పేరు మార్చుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. రాసి పెట్టుకో కేసీఆర్.. పాలమూరులో మీ జెండా ఎగరనివ్వమన్నారు.
పాలమూరు ప్రాజెక్టుకు డిసెంబర్లోగా 90 టీఎంసీలు నీటిని సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నీటి సమస్యలపై పక్క రాష్ట్రాలతో చర్చలు వద్దా? అని కేసీఆర్ తీరును ఎండగట్టారు. తాను చర్చలు చేస్తానంటే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ఏపీతో చర్చలు జరుపుతామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణే తన లక్ష్యమని సీఎం రేవంత్ ప్రకటించారు. వలసలు, ఆత్మహత్యల కష్టనష్టాలు మనకు తెలుసునన్నారు. కేసీఆర్ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు. కరీంనగర్ నుంచి వలస వచ్చిన కేసీఆర్ను గెలిపించారని వివరించారు. ఎంపీగా గెలిచిన కేసీఆర్ కనీసం ప్రజలను కలవడానికి కూడా రాలేదన్నారు. కష్టకాలంలో ఆదుకున్న పాలమూరును కేసీఆర్ పట్టించుకోలేదని చెప్పారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు కానీ కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. పాలమూరు నుంచి పారిపోయిన కేసీఆర్ ద్రోహి అవుతారా? లేక నేనా? అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదంటూ కేసీఆర్పై మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతలు పాదయాత్ర చేస్తామంటున్నారని సీఎం రేవంత్ వ్యంగ్యంగా అన్నారు. కాశీ వరకు పొర్లు దండాలు చేసినా మీ పాపాలను ఎవరూ మరిచిపోరని ఆ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడైనా రైతుల కష్టాల గురించి ఆరా తీశారా? అని ప్రశ్నించారు. మేక వన్నె పులిలాంటి కేసీఆర్ను ప్రజలు ఎప్పటికీ నమ్మరని పేర్కొన్నారు. కేసీఆర్ తర్వాత ఆయన కొడుకు, మనవడు రాజ్యాలు ఏలుతారా? అని నిలదీశారు. నాడు మిడ్జిల్ నుంచి తాను జెడ్పిటిసిగా గెలిచానని గుర్తు చేశారు. 2006లో మీరు నాటిన మొక్కే ఇప్పుడు వృక్షమై మీ ముందుందని ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. నాడు మీరు గెలిపించిన ఈ జెడ్పిటిసి ఇప్పుడు రాష్ట్రానికి సీఎం అయ్యారని వివరించారు. కేసీఆర్ కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయ్యిందని ఎద్దేవా చేశారు. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మనవాళ్లే ఉండాలన్నారు.
ఆత్మగౌరవంతో బతకాలంటే ఇందిరమ్మ ఇల్లు ఉండాలని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదన్నారు. బీఆర్ఎస్ నేతలవి నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని చెప్పి మోసం చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి దగా చేశారన్నారు. కేజీ టు పీజీ విద్య హామీ ఎక్కడికి పోయిందని ఆ పార్టీ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇకపై పాలమూరు గడ్డపై బీఆర్ఎస్ గుర్తు మాయమని సీఎం రేవంత్ జోస్యం చెప్పారు.