
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాలపై అభ్యర్థులు, మీడియా, సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న సందేహాలు, ఆరోపణలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చింది. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాలపై అభ్యర్థులు, మీడియా, సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న సందేహాలు, ఆరోపణలపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చింది. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్, శాప్ ఎండీ భరణి తదితర ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతి నియామకం నిబంధనల మేరకే జరిగిందని, ఎక్కడా ఎలాంటి అక్రమాలకు తావులేదని తేల్చిచెప్పారు. ముఖ్యంగా, హారిజాంటల్ రిజర్వేషన్ విధానంపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ అపోహలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు.వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్లు అంటే ఏమిటి?ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో రెండు రకాల రిజర్వేషన్లు అమలవుతాయని అధికారులు వివరించారు. అవి వర్టికల్ (నిలువు) మరియు హారిజాంటల్ (అడ్డం) రిజర్వేషన్లు.వర్టికల్ రిజర్వేషన్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి సామాజిక వర్గాలకు కల్పించే రిజర్వేషన్ను వర్టికల్ రిజర్వేషన్ అంటారు. దీనికోసం 100 పాయింట్ల రోస్టర్ విధానం అమల్లో ఉంటుంది. ఇందులో ప్రతి కేటగిరీకి నిర్దిష్ట రోస్టర్ పాయింట్లు కేటాయించి ఉంటాయి. ఈ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో కూడా పోటీ పడవచ్చు. దీనివల్ల కొన్నిసార్లు ఆయా వర్గాలకు నిర్దేశించిన శాతం కంటే ఎక్కువ మంది ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.హారిజాంటల్ రిజర్వేషన్: మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులు వంటి ప్రత్యేక కేటగిరీలకు కల్పించేది హారిజాంటల్ రిజర్వేషన్. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం, ఈ కేటగిరీలకు నిర్దిష్ట రోస్టర్ పాయింట్లు ఉండవు. మొత్తం నియామకాల్లో నిర్దేశిత శాతం (ఉదాహరణకు మహిళలకు 33.3%) ఉండేలా చూడటమే దీని ఉద్దేశం.పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ