
కోట్ల రూపాయిల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్ది వెల్లడించారు. క్యూర్ పరిధిలో ఎల్ఐజీ, ఎంఐజీ (LIG, MIG) వర్గాలకు
కోట్ల రూపాయిల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్ది వెల్లడించారు. క్యూర్ పరిధిలో ఎల్ఐజీ, ఎంఐజీ (LIG, MIG) వర్గాలకు లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు.
హైదరాబాద్, జూన్05: కోట్ల రూపాయిల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్ది వెల్లడించారు. క్యూర్ పరిధిలో ఎల్ఐజీ, ఎంఐజీ (LIG, MIG) వర్గాలకు లక్ష ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని సచివాలయంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఉన్నతాధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు ఇంటి స్థలంలో యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3.50 లక్షల ఇళ్లకు పరిపాలనా అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. క్యూర్ పరిధిలో లక్ష ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లు నిర్మిస్తామని వివరించారు. ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విధానంపై ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. పేదల సంక్షేమం కోసం విలువైన ప్రభుత్వ భూముల వినియోగిస్తామని చెప్పారు. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు. పేదలకు గౌరవప్రదమైన జీవితమే లక్ష్యంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
ఒకే కుటుంబంలో విషాదం.. ఈతకు వెళ్లి నలుగురి చిన్నారుల మృతి
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు