
Siddipet News: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలను బలోపేతం చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధంగా ఉన్నదనీ గూడూరు శ్రీనివాస్ అన్నారు.రాష్ట్రంలో కుల సంఘాలకు ఫెడరేషన్ల ఏర్పాటు చేసిన ఘనత రేవంత్
రెడ్డి కే దక్కిందన్నరు. సిద్దిపేట పట్టణంలోని కాళ్ళకుంట్ల కాలనీ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ సమావేశానికి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి గూడూరు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవృత్తుల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.
Siddipet News: తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలి ముఖ్యంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా కుల సంఘాలతో చర్చించి ముఖ్యమంత్రి గారికి నివేదిక సమర్పిస్తానని గూడూరు శ్రీనివాస్ తెలిపారు ప్రభుత్వం ద్వారా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందజేయడానికి తన శాయశక్తుల కృషి చేస్తానని ఆయన తెలిపారు.ప్రభుత్వం ద్వారా అర్హులకు సంక్రమించే అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు డాక్టర్ కే సతీష్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కాముని రాజేశం ఇందిరానగర్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు డాక్టర్ విట్టల్ పాలకొండ కాలనీ నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు స్వర్గం రమేష్ కార్యవర్గ సభ్యులు పద్మశాలి కుల బంధువులు హాజరైనారు.
CM Revanth Visit to Palamuru: సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటన
Text Claw : యువతలో వేగంగా పెరుగుతున్న టెక్ట్స్ క్లా సమస్య..
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Siddipet news: సిద్దిపేటలో అద్వితీయ ఎంటర్ప్రైజెస్ ప్రారంభించిన హరీశ్ రావు
World Environment Day 2026: పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి పొన్నం ప్రభాకర్
Narmeta Oil Palm Factory:నర్మేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై అపోహలు నమ్మవద్దు: మేనేజర్
Nangunoor Paddy Procurement:మిల్లర్ల అక్రమాలపై నంగునూర్ మార్కెట్ చైర్మన్ ఫైర్!
BRS protest : పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై బీఆర్ఎస్ నిరసన ధర్నా
Telangana Criminal Gang Arrested: సిద్దిపేటలో వరుస దొంగల ముఠా గుట్టురట్టు!