
తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. ఇలా థియేటర్స్‌లో విడుదల కాగానే అలా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ‘పెద్ది’ని కూడా పైరసీ బూతం వదల్లేదు. విడుదలైన
Jun 5 2026 5:01 PM | Updated on Jun 5 2026 5:08 PM
తెలుగు సినీ పరిశ్రమను పైరసీ భూతం ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. ఇలా థియేటర్స్‌లో విడుదల కాగానే అలా హెచ్డీ ప్రింట్ ఆన్లైన్ అందుబాటులోకి వచ్చేస్తోంది. ‘పెద్ది’ని కూడా పైరసీ బూతం వదల్లేదు. విడుదలైన రెండో రోజే పెద్ది చిత్రానికి సంబంధించిన హై క్వాలిటీ హెచ్డీ ప్రింట్ ఆన్లైన్లో లీక్ కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం..జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. తొలి రోజు ఈ చిత్రం భారీ కలెక్షన్లను కూడా రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 135 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు మేకర్స్ ప్రటించారు.అంతేకాదు వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు సినీ పండితులు వెల్లడించారు. ఇలాంటి తరుణంలో చిత్రబృందానికి భారీ షాక్ తగిలింది. సినిమాకు సంబంధించని హెచ్డీ ప్రింట్ ప్రముఖ పైరసీ వెబ్సైట్లో ప్రత్యేక్షమైంది.
సినిమా లాంగ్ రన్ కలెక్షన్లపై దీని ప్రభావం పడుతుందేమోనని ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంపై మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పైరసీ లింకులను వెంటనే ఇంటర్నెట్ నుంచి తొలగించాలని వారు సైబర్ క్రైమ్ పోలీసులను, డిజిటల్ టీమ్‌ను సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
'బిగ్‌బాస్' కీర్తిభట్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
హైదరాబాద్ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫోన్ సంభాషణలు
CM DK శివకుమార్ కు బిగ్ షాక్.. కేబినెట్లో దెబ్బ మీద దెబ్బ
ఫస్ట్ ర్యాంకర్ కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు..?
లక్షకు 2. 50 లక్షల లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల కురిపిస్తున్న స్టాక్
టీమిండియా కెప్టెన్ గా శ్రేయాస్.. వైభవ్ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్