.webp&w=3840&q=75)
ప్రేమ పేరిట నరరూప రాక్షసులు సమాజంలో ఎలాంటి ఘోరాలకు ఒడిగడుతున్నారో చెప్పడానికి పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో జరిగిన ఘటనే ఒక నిదర్శనం. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే, బ్రేకప్ చెప్పిందనే ఒకే ఒక్క
ప్రేమ పేరిట నరరూప రాక్షసులు సమాజంలో ఎలాంటి ఘోరాలకు ఒడిగడుతున్నారో చెప్పడానికి పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో జరిగిన ఘటనే ఒక నిదర్శనం. ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే, బ్రేకప్ చెప్పిందనే ఒకే ఒక్క కారణంతో కక్ష పెంచుకుని, కంటి ముందే తిరిగిన యువతిని అందరి ముందూ అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. జూన్ 2వ తేదీ మంగళవారం నాడు మొహాలీలోని సెక్టార్ 66 లో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ నెత్తుటి ఘోరం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అందరూ చూస్తుండగానే ఆఫీసు లోపల జరిగిన ఈ బ్లడ్‌బాత్ తాలూకు దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయి, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు అందించిన అధికారిక వివరాల ప్రకారం.. ఈ దారుణ హత్యకు గురైన అమ్మాయి 32 ఏళ్ల డింపుల్. నిందితుడు హర్విందర్ సింగ్, డింపుల్ గతంలో ఒకే ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీలో సహోద్యోగులుగా పనిచేశారు. అక్కడ వారిద్దరి మధ్య మొదలైన పరిచయం, కొద్దిరోజుల్లోనే స్నేహంగా మారి, ఆపై ప్రేమకు దారితీసింది. చాలా కాలం పాటు వీరి ప్రేమాయణం సాఫీగానే సాగింది.
అయితే, గత కొన్ని నెలలుగా వారి మధ్య మనస్పర్థలు, వ్యక్తిగత సమస్యలు తలెత్తడంతో, దాదాపు ఆరు నెలల క్రితం డింపుల్ అతనికి బ్రేకప్ చెప్పేసింది. హర్విందర్ సింగ్‌తో సంబంధాన్ని పూర్తిగా తెంచుకుని తన పని తాను చేసుకుంటూ ఒంటరిగా జీవించడం ప్రారంభించింది. కానీ, డింపుల్ తనను దూరం పెట్టడాన్ని నిందితుడు తట్టుకోలేకపోయాడు. ఆమెపై తీవ్రమైన కక్ష, ప్రతికారం పెంచుకున్నాడు.
గురువారం సాయంత్రం డింపుల్ ఎప్పటిలాగే మొహాలీ సెక్టార్ 66 లోని తన ఆఫీసులో రోజువారీ విధుల్లో మునిగిపోయి ఉంది. సరిగ్గా అదే సమయంలో హర్విందర్ సింగ్ పక్కా ప్లాన్‌తో, పదునైన కత్తితో ఆఫీసులోకి దూసుకువచ్చాడు. డింపుల్ క్యాబిన్ వద్దకు వెళ్లి ఆమెతో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. మాట మాట పెరగడంతో, ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించాడు.
ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. ఏకంగా 32 సార్లు ఆ కత్తితో డింపుల్ శరీరంపై నృశంసంగా పొడిచాడు. ఆఫీసులో ఉన్న తోటి ఉద్యోగులు ఆ కిరాతకుడిని అడ్డుకునేందుకు ప్రాణాలకు తెగించి ప్రయత్నించారు. కానీ, అడ్డువస్తే మీ అందరినీ కూడా చంపేస్తానంటూ హర్విందర్ కత్తి చూపిస్తూ బెదిరించడంతో వారు భయంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.
సహోద్యోగుల కళ్లముందే డింపుల్ తీవ్ర రక్తపు మడుగులో పడి గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. ఆమె మరణించినట్లు నిర్ధారించుకున్న అనంతరం, నిందితుడు హర్విందర్ సింగ్ అదే కత్తితో తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న ఇద్దరినీ ఆసుపత్రికి తరలించారు.
అయితే డింపుల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించగా, తీవ్ర గాయాలపాలైన నిందితుడు హర్విందర్ సింగ్ ప్రస్తుతం ఆసుపత్రిలో పోలీసుల నిఘా నడుమ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘోర ఘటనపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కార్యాలయంలో భద్రతపై, ప్రేమోన్మాదుల వికృత చేష్టలపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Disclaimer: All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent..