Annamalai Reveals Rajinikanth Offer : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నమొన్నటి వరకు దళపతి విజయ్ రాజకీయ ఎంట్రీపైనే ఉన్న ఫోకస్.. ఇప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి, యువనేత
Annamalai Reveals Rajinikanth Offer : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నమొన్నటి వరకు దళపతి విజయ్ రాజకీయ ఎంట్రీపైనే ఉన్న ఫోకస్.. ఇప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి, యువనేత కె. అన్నామలై వైపు మళ్లింది. భారతీయ జనతా పార్టీకి అధికారికంగా గుడ్‌బై చెప్పిన అన్నామలై.. తన భవిష్యత్తు కార్యాచరణపై తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర రహస్యాన్ని బహిర్గతం చేశారు. తనతో కలిసి నడవాలని, చేతులు కలపాలని రజనీకాంత్ స్వయంగా తనను కోరినట్లు అన్నామలై వెల్లడించారు. అయితే ఆ ప్రతిపాదనకు తాను నో చెప్పానని వివరించారు. ఎందుకో కూడా వెల్లడించారు. ఆపూర్తి వివరాలు మీకోసం. సొంత దారిలోనే ప్రయాణం..!తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా, తాను స్వతంత్ర రాజకీయ మార్గంలోనే ముందుకు సాగుతానని అన్నామలై ప్రకటించారు. గతంలో బీజేపీ సీనియర్ నేత బి.ఎల్. సంతోష్ ఇచ్చిన ఒక ప్రత్యేక హామీ మేరకే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తన పొలిటికల్ ఎంట్రీపై ఉన్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకే ఈ నిజాన్ని చెప్తున్నానని అన్నారు. అయితే తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ వ్యూహాల విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయాలు.. బీజేపీ జాతీయ నాయకత్వ ఆలోచనలతో సరిపోలలేదని ఆయన ఓపెన్‌గా అంగీకరించారు.ఈ సిద్ధాంతపరమైన విభేదాలను పరిష్కరించుకోవడానికి గత 18 నెలలుగా పార్టీ అగ్రనాయకత్వంతో ఎన్నో రౌండ్ల చర్చలు జరిపానని.. కానీ అవి సఫలం కాకపోవడంతో, ఇక ఎంతమాత్రం బీజేపీకి భారం కాకూడదనే ఉద్దేశంతోనే బయటకు వచ్చానని వివరించారు. నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ.. పార్టీ పెద్దల సూచన మేరకు ఎన్నికల బాధ్యతల కోసం ఇంతకాలం వేచి చూశానని తెలిపారు.‘ఐఎంకే’ ఉద్యమం ప్రారంభం..తన రాబోయే రాజకీయాలు పూర్తిగా సామాన్య ప్రజల అజెండా చుట్టూనే తిరుగుతాయని అన్నామలై స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాము సొంతంగా బరిలోకి దిగుతామని, అంతవరకు రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు శ్రమిస్తానని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎప్పటికీ అపారమైన గౌరవం ఉంటుందని, ఇప్పటివరకు బీజేపీ తనకు కల్పించిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆయన ‘అన్నామలై మక్కల్ ఇయక్కమ్’ (IMK) పేరిట ఒక సరికొత్త రాజకీయ ఉద్యమాన్ని అధికారికంగా ప్రారంభించారు. దీనికి క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి, ముఖ్యంగా యువత నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన లభిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.లైట్ తీసుకున్న బీజేపీ..మరోవైపు అన్నామలై నిష్క్రమణపై తమిళనాడు ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ స్పందించారు. అన్నామలై పార్టీని వీడి వెళ్లడం వల్ల క్షేత్రస్థాయిలో బీజేపీకి ఎలాంటి నష్టం వాటిల్లబోదని ఆయన తేల్చి చెప్పారు. నాయకులు మారినా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు, ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వ్యూహాత్మక చర్యలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు.