నల్లపూసల కార్యక్రమం జరగనివ్వకుండా దమయంతి, భవానీ శంకర్ మంచి ప్లాన్ వేస్తారు. అగ్రిమెంట్ పేపర్లు తమ వద్ద ఉన్నాయనే నమ్మకంతో భవానీ శంకర్, దమయంతి రెచ్చిపోతారు. రాధ, విక్రమ్‌లు తమంతట తాము బయట పెట్టేలా
నల్లపూసల కార్యక్రమం జరగనివ్వకుండా దమయంతి, భవానీ శంకర్ మంచి ప్లాన్ వేస్తారు. అగ్రిమెంట్ పేపర్లు తమ వద్ద ఉన్నాయనే నమ్మకంతో భవానీ శంకర్, దమయంతి రెచ్చిపోతారు. రాధ, విక్రమ్‌లు తమంతట తాము బయట పెట్టేలా లేరని దమయంతి అనుకుంటుంది. రాధ మెడలో నల్లపూసలు వేసేందుకు విక్రమ్ కృష్ట రెడీ అవుతాడు. రాధ వద్దు అని అంటుంది. ఎందుకు వద్దు అంటున్నావ్ అమ్మా అని పద్మ, సునంద అడుగుతారు. రాధ చెప్పదు.. నేను చెబుతాను.. ఎందుకంటే వారిది అగ్నిసాక్షిగా జరిగిన పెళ్లి కాదు.. ప్రేమించి పెళ్లి చేసుకోలేదు.. అగ్రిమెంట్ మ్యారేజ్ అని నిజం బయట పెడుతుంది దమయంతి.ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ వదిన.. నీ బిడ్డని నా కొడుకు పెళ్లి చేసుకోలేదని ఇలా అంటున్నావా? అని సునంద అంటుంది. ఇది నేను నమ్మను అని పద్మావతి అంటుంది. ఇలా నిందలు వేయడం కరెక్ట్ కాదు.. సాక్ష్యాలు లేకుండా మాట్లాడొద్దు అని రామచంద్ర అంటాడు. మీరు ఇలా అడుగుతారని నాకు తెలిసే సాక్ష్యాలు రెడీగా పెట్టాను అని దమయంతి అంటుంది. ఆ ఫైల్లో విక్రమ్, రాధ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంటుంది.. అగ్రిమెంట్ పత్రాల్ని ఆల్రెడీ విక్రమ్ మార్చేశాడు. ఆ విషయం తెలిసి దమయంతి, భవానీ శంకర్ ఖంగుతింటారు.🔹‘పొదరిల్లు’ టుడే ఎపిసోడ్ : అస్థిత్వం, వ్యక్తిత్వం కోల్పోయా.. ఆది, ప్రతాప్‌లపై హారిక తిరుగుబాబు.. శైలు గుండెకి గాయం చేసిన కేశవఇందులో మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంది.. మీరన్నట్టుగా లేదు కదా అని రామచంద్ర అంటాడు. వాడు రాత్రికి రాత్రి మార్చేశాడు అని భవానీ శంకర్, దమయంతి అంటాడు. అలా దొంగతనానికి వచ్చిన వాడు ఫైల్ పట్టుకు పోతాడు కానీ ఇలా ఎందుకు మార్చేస్తాడు అని రామచంద్ర లాజిక్ పట్టుకుంటాడు. కరెక్ట్ మామయ్య అని విక్రమ్ కాస్త ఓవర్ చేస్తాడు. ఇక అగ్రిమెంట్ పేపర్లు మార్చిన విషయాన్ని రాధకి చెబుతాడు విక్రమ్. దీంతో రాధ కూడా కాస్త కూల్ అవుతుంది. అయితే వీరిద్దరిదీ అగ్రిమెంట్ పెళ్లి కాదని మీరంతా నమ్ముతున్నారు.. నిజమైన పెళ్లే అని అనుకుంటున్నారు కదా.. ఈ నల్ల పూసల ప్రాముఖ్యత చెప్పండి పంతులు గారు అని దమయంతి అంటుంది.ఆ గౌరీ శంకరులకు ప్రతీరూపమే ఈ నల్లపూసలు, తాళి కట్టినంత మాత్రానా పెళ్లికి సార్థకత రాదు.. ఈ నల్ల పూసలే పరిపూర్ణతను తీసుకు వస్తుందని పంతులు అంటాడు. అయితే ఇప్పుడు ఆ తాడుని రాధ మెడలో విక్రమ్‌ను వేయమనండి అని దమయంతి అంటుంది. దీంతో విక్రమ్ ఆ తాడుని రాధ మెడలో వేసేందుకు రెడీ అవుతాడు. కానీ రాధ మాత్రం వద్దు అన్నట్టుగా ఆపుతుంది. అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.