పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని కూడా ఆసక్తితో వినండి. ఇలా చేయడం వల్ల వారికి వారి భావాలను వ్యక్తపరిచే ధైర్యం వస్తుంది. పిల్లలు బాధపడినా, కోప్పడినా వారిని చిన్నచూపు చూడొద్దు. అర్థం చేసుకోవడానికి ట్రై
పిల్లలు చెప్పే ప్రతి విషయాన్ని కూడా ఆసక్తితో వినండి. ఇలా చేయడం వల్ల వారికి వారి భావాలను వ్యక్తపరిచే ధైర్యం వస్తుంది.
పిల్లలు బాధపడినా, కోప్పడినా వారిని చిన్నచూపు చూడొద్దు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ప్రేమగా మాట్లాడాలి.
"నిన్ను ప్రేమిస్తున్నాను", "నువ్వు మాకు చాలా ముఖ్యం" అని ప్రేమగా మాట్లాడితే పిల్లల్లో భద్రతాభావం పెరుగుతుంది.
కుటుంబ సభ్యులతో కలిసి పిల్లలు భోజనం చేయడం వల్ల బంధం బాగుంటుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
కోపం వచ్చినప్పుడు ఎలా ప్రశాంతంగా ఉండాలో వారికి మీ ప్రవర్తన ద్వారా తెలపండి. అలా వారు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్చుకుంటారు.
పిల్లల మంచి ప్రవర్తనను చూసి అభినందించండి. అప్పుడు వారికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది
పిల్లలతో ఆడడం వంటివి చేయండి. వారితో సమయాన్ని గడిపితే బంధం బాగుంటుంది. వారికి కూడా బాగా నచ్చుతుంది.
ప్రతి తప్పును చూసి మందలించకుండా, తప్పులు చేయడానికి గల కారణం తెలుసుకోండి. మరోసారి అలా జరగకుండా ఉండేందుకు సలహాలు ఇవ్వండి.
రోజూ వారికి లభించిన వాటికి కృతజ్ఞత చెప్పడానికి అలవాటు చేయండి. ఇది చాలా ముఖ్యమైనది.