
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. వాలంటరీ రిటెన్షన్ రూట్(వీఆర్ఆర్) కింద స్థానిక రుణ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకు
Jun 5 2026 3:05 PM | Updated on Jun 5 2026 3:09 PM
దేశీయ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ షాక్ ఇచ్చింది. వాలంటరీ రిటెన్షన్ రూట్(వీఆర్ఆర్) కింద స్థానిక రుణ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెబీ హెచ్చరిక లేఖ జారీ చేసింది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు దాఖలు చేసిన ఒక ఫైలింగ్‌లో అధికారికంగా వెల్లడించింది.
సెక్యూరిటీ కస్టోడియన్ (Securities Custodian)గా వ్యవహరిస్తున్న ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (ఎఫ్‌పీఐ)కు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చినట్లు సెబీ గుర్తించింది. వీఆర్ఆర్ ప్రోగ్రామ్ కింద దేశీయ బాండ్లలో పెట్టుబడి పెట్టిన సదరు విదేశీ ఇన్వెస్టర్, లాక్-ఇన్ పీరియడ్ పూర్తి కాకముందే తన నిధులను స్వదేశానికి తిరిగి తీసుకెళ్లేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ అనుమతించింది.
నిబంధనల ప్రకారం గడువు ముగియకుండా నిధులను వెనక్కి పంపడం ఆర్బీఐ, సెబీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేస్తూ సెబీ జూన్ 1న బ్యాంకుకు హెచ్చరిక లేఖ పంపింది. ఈ ఉల్లంఘనకు సంబంధించిన వివరాలను నిర్ణీత కాలపరిమితిలోగా ఎక్స్ఛేంజీలకు వెల్లడించడంలోనూ బ్యాంక్ విఫలమైంది. అనుకోకుండా జరిగిన ఆలస్యం వల్లే ఈ సమాచారాన్ని సకాలంలో సమర్పించలేకపోయామని బ్యాంక్ అంగీకరించింది.
వీఆర్ఆర్ అంటే ఏమిటి? దాని ప్రాధాన్యత ఏంటి?
భారతీయ ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు నిలిపి ఉంచేలా ప్రోత్సహించడానికి ఆర్బీఐ 2019లో ఈ స్వచ్ఛంద నిలుపుదల మార్గాన్ని (వీఆర్ఆర్) ప్రవేశపెట్టింది. సాధారణ ఎఫ్‌పీఐ పెట్టుబడులపై ఉండే కఠినమైన నియంత్రణ అవసరాల నుంచి విదేశీ ఇన్వెస్టర్లకు ఈ మార్గం ద్వారా కొన్ని మినహాయింపులు లభిస్తాయి. అయితే, ఇందుకు ప్రతిగా సదరు విదేశీ ఇన్వెస్టర్ తమ పెట్టుబడుల్లో ఒక కనీస శాతాన్ని నిర్ణీత కాలం పాటు దేశంలోనే ఉంచేందుకు స్వచ్ఛందంగా కట్టుబడి ఉండాలి. కాగా, ఇటీవలే (ఫిబ్రవరిలో) కేంద్ర బ్యాంక్ ఈ ఎఫ్‌పీఐ పెట్టుబడుల కోసం వీఆర్ఆర్ను జనరల్ రూట్లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది.
సెబీ తీసుకున్న ఈ నియంత్రణ చర్యపై ఐసీఐసీఐ బ్యాంక్ స్పందించింది. ఈ హెచ్చరిక లేఖ కేవలం ఒక నిర్దిష్ట సమ్మతి లోపానికి సంబంధించినది మాత్రమేనని తెలిపింది. ‘ఈ చర్య వల్ల బ్యాంకు ఆర్థిక స్థితిగతులపై ఎలాంటి ప్రభావం ఉండదు. బ్యాంకు దైనందిన కార్యకలాపాలు లేదా వ్యాపార నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగదు. భవిష్యత్తులో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా అంతర్గత నియంత్రణలను మరింత బలోపేతం చేస్తాం’ అని చెప్పింది. బ్యాంకు మొత్తం పనితీరుపై గానీ, భద్రతపై గానీ దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని మేనేజ్మెంట్ ఇన్వెస్టర్లకు, ఖాతాదారులకు భరోసా ఇచ్చింది.
ఇదీ చదవండి: మూల పడిన బంగారం.. దేశ ఆర్థికానికి మూలాధారం!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
హైదరాబాద్ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)
బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు
నైరుతి ఎంట్రీ.. ఏపీ, తెలంగాణలో వర్ష్పాల జోరు
పెద్ది సూపర్ సక్సెస్... ఉపాసనకు దిష్టి తీసిన రామ్ చరణ్ ఫ్యాన్స్
నీకు భజన చేయకపోతే కేసులా... ఏం చేస్తావో చేసుకో...
ఇప్పుడు బీచ్ లో బార్ అండ్ రెస్టారెంట్లు.. త్వరలో రెడ్ లైట్ ఏరియా కూడా..!