
ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ హ్యాండీ (81) దారుణ హత్య కలకలం రేపింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని టార్జానాలో ఆయన ప్రేయసి కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు (జూన్ 4)పోలీసులు
Jun 5 2026 3:08 PM | Updated on Jun 5 2026 3:12 PM
ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ హ్యాండీ (81) దారుణ హత్య కలకలం రేపింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని టార్జానాలో ఆయన ప్రేయసి కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు (జూన్ 4)పోలీసులు ప్రాథమికంగానిర్ధారించారు. టాప్ గన్: మావెరిక్', జుమాంజి వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన హ్యాండీహత్యపై హాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.
911 కాల్ రావడంతో అధికారులు అతని ఇంటికి చేరుకున్నారు. ఛాతీపై గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న జేమ్స్ హ్యాండీని వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కేసులో హ్యాండీ ప్రియురాలి కుమారుడు మైఖేల్ గ్లెడ్‌హిల్ (44) ను అరెస్టు చేశారు. జేమ్స్ హ్యాండీ ప్రేమికురాలిగా భావిస్తున్న మహిళ గురించి ఎటువంటి వివరాలు తెలియవు. ఆయన వృత్తి జీవితం అందరికీ తెలిసినప్పటికీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియవు.
జేమ్స్ హ్యాండీ కరియర్, నెట్‌వర్త్ దశాబ్దాల నటనాజీవితంలో 1977 నుండి అనేక సినిమాల్లో నటించారు. అలాగే పలే టెలివిజన్ షోలలో నటించారు. ముఖ్యంగా టాప్ గన్: మావెరిక్ చిత్రంలో 'జిమ్మీ' పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2017లో, హ్యూ జాక్మన్ ప్రధాన పాత్రలో నటించిన అమెరికన్ సూపర్ హీరో చిత్రం లోగాన్‌లో ఆయన నటించారు. జేమ్స్ హ్యాండీ ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆయన నెటవర్త్ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు ఉండేది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో భారీ ఆస్తులనే కూటబెట్టారు. అప్ టర్న్ బిజినెస్ వారి ఒక నివేదిక ప్రకారం, 2026 నాటికి జేమ్స్ హ్యాండీ నికర ఆస్తి సుమారు 2-3 మిలియన్ డాలర్లు(సుమారు రూ.19-28.8 కోట్లు)గా అంచనా .
ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్‌తో రోజుకు రూ. 1500
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
తమన్నా ఇంట్లో లింగభైరవి పుణ్యపూజ (ఫొటోలు)
హైదరాబాద్ : మళ్లీ పలకరించిన వరుణుడు (ఫొటోలు)
బుట్టబొమ్మ పూజా హెగ్డే స్మైలీ లుక్స్.. ఫోటోలు
నైరుతి ఎంట్రీ.. ఏపీ, తెలంగాణలో వర్ష్పాల జోరు
పెద్ది సూపర్ సక్సెస్... ఉపాసనకు దిష్టి తీసిన రామ్ చరణ్ ఫ్యాన్స్
నీకు భజన చేయకపోతే కేసులా... ఏం చేస్తావో చేసుకో...
ఇప్పుడు బీచ్ లో బార్ అండ్ రెస్టారెంట్లు.. త్వరలో రెడ్ లైట్ ఏరియా కూడా..!