
కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలలోనూ పురోగతి కనిపిస్తుంది. ఏపీలో ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసి ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ (VPA) పర్యావరణ పరిరక్షణ
కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలలోనూ పురోగతి కనిపిస్తుంది. ఏపీలో ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసి ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ (VPA) పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాలలో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ ప్రతిష్టాత్మకమైన ఎల్-2 గ్రీన్ పోర్టు (L2 Green Port) గుర్తింపును సొంతం చేసుకుంది.ప్రతిష్టాత్మకమైన ఎల్-2 గ్రీన్ పోర్టు గుర్తింపు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఈఎస్జీ అండ్ సర్క్యులారిటీ సంస్థ ఈ అరుదైన సర్టిఫికేషన్‌ను పోర్టుకు అందజేసింది. వ్యర్థాల సమర్థవంతమైన నిర్వహణ, కాలుష్య నియంత్రణ, ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన వనరుల (రెన్యూవబుల్ ఎనర్జీ) వినియోగం వంటి కీలక అంశాల ఆధారంగా ఈ అవార్డును ఖరారు చేశారు.గ్రీన్ ఎనర్జీతో నడుస్తున్న ప్రముఖ పోర్టుల జాబితాలో వైజాగ్ పోర్టుదేశంలోనే వంద శాతం పర్యావరణ అనుకూలమైన గ్రీన్ పవర్ (సోలార్ ఎనర్జీ)తో నడుస్తున్న ప్రముఖ పోర్టుల జాబితాలో వైజాగ్ పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. పర్యావరణ సమతుల్యత కోసం 2024 నుండి 2027 మధ్య కాలంలో ఏకంగా పది లక్షల మొక్కలు నాటాలని పోర్టు యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది.సముద్ర తీర ప్రాంత పరిరక్షణకు పోర్టు అథారిటీ ప్రత్యేక శ్రద్ధఅలాగే, కాలుష్య నివారణలో భాగంగా 10 ఎంఎల్‌డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రం (STP), 400 కేఎల్డీ సామర్థ్యం గల ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను (ETP) ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని రోడ్లపై మరియు యార్డులలో దుమ్ము రేగకుండా చల్లడానికి ఉపయోగిస్తున్నారు.సముద్ర తీర ప్రాంత పరిరక్షణకు కూడా పోర్టు అథారిటీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.పర్యావరణమే కాకుండా, కార్పొరేట్ సామాజిక బాధ్యత నిర్వర్తిస్తున్న పోర్ట్ తీరప్రాంతం కోతకు గురికాకుండా నిరోధించేందుకు ప్రతి ఏటా రూ.20 కోట్లను వెచ్చిస్తోంది. కార్గో హ్యాండ్లింగ్ సమయంలో దుమ్ము ఉద్గారాలను తగ్గించేందుకు అధునాతన కవర్డ్ స్టోరేజ్ షెడ్లను నిర్మించారు. కేవలం పర్యావరణమే కాకుండా, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద విద్య, నైపుణ్యాభివృద్ధి, వైద్య రంగాల కోసం రూ. 4.31 కోట్లను ఖర్చు చేశారు. ఈ అన్ని చర్యలు విశాఖ పోర్టుకు ప్రతిష్టాత్మకమైన ఎల్-2 గ్రీన్ పోర్టు గా గుర్తింపు పొందటానికి కారణం అవుతుంది. దీంతో పోర్టు అధికారులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.