
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ (అడ్వాన్స్డ్)-2026 రాసిన విద్యార్థుల వ్యక్తిగత డేటా లీక్ (Data breach) అయిందని, వారి గోప్యతకు భంగం వాటిల్లిందంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఐఐటీ రూర్కీ (IIT Roorkee)
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ (అడ్వాన్స్డ్)-2026 రాసిన విద్యార్థుల వ్యక్తిగత డేటా లీక్ (Data breach) అయిందని, వారి గోప్యతకు భంగం వాటిల్లిందంటూ జరుగుతోన్న ప్రచారాన్ని ఐఐటీ రూర్కీ (IIT Roorkee) ఖండించింది. అవన్నీ అసత్య కథనాలేనని కొట్టిపారేసింది. జేఈఈ (అడ్వాన్స్డ్) - 2026 ఫలితాలకు సంబంధించిన క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో లోపం ఉన్న విషయం వాస్తవమేనని పేర్కొంది. అయితే, క్లౌడ్ స్టోరేజ్‌లో ఉన్న విద్యార్థుల డేటా కేవలం చదవడానికి మాత్రమే వీలుందని, మార్పు చేర్పులు చేసేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది.
విద్యార్థులను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఐఐటీ రూర్కీ పేర్కొంది. క్లౌడ్ స్టోరేజ్ నుంచి ఏ విద్యార్థికి సంబంధించిన సమాచారాన్ని ఎవరూ సంగ్రహించలేరని.. అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు, పరీక్ష ఫలితాలపై ఎలాంటి ప్రభావం పడలేదని వెల్లడించింది. అయినప్పటికీ, సమాచార గోప్యతను పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపింది. లక్షలాది విద్యార్థుల వ్యక్తిగత వివరాలతోపాటు, వారి పరీక్ష ఫలితాలకు సంబంధించిన సమాచారానికి గోప్యత, రక్షణ కరవైందంటూ ఓ యువ సైబర్ భద్రతా పరిశోధకుడు ఎత్తి చూపిన నేపథ్యంలో ఐఐటీ రూర్కీ ఈ మేరకు ప్రకటన వెలువరించింది. ఇదీ చదవండి: సీబీఎస్ఈ పోర్టల్‌పై క్లాడ్ టూల్స్ దాడి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని 28 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది.