
ఇంటర్నెట్ డెస్క్: కొందరు ఫ్యాన్స్‌కు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టికెట్లు ఉచితంగా లభించాయి. అయితే, సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగినట్లు ఫిఫా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఓ షరతు
ఇంటర్నెట్ డెస్క్: కొందరు ఫ్యాన్స్‌కు ఫుట్‌బాల్ వరల్డ్ కప్ టికెట్లు ఉచితంగా లభించాయి. అయితే, సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగినట్లు ఫిఫా వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ ఓ షరతు విధించింది. ఆ సీట్లను నిలుపుకోవాలంటే మాత్రం వారం రోజుల్లోగా టికెట్ల ధరను చెల్లించాలని స్పష్టం చేసింది. ఒకవేళ అలా చేయకపోతే మాత్రం ఆయా టికెట్లను కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కీలక ప్రకటనను విడుదల చేసింది.
‘‘జూన్ 3వ తేదీన దాదాపు 60 మంది అభిమానులు వరల్డ్ కప్ టికెట్లను ఉచితంగా పొందారని ఫిఫా ధ్రువీకరించింది. జీరో డాలర్లకే ఆ టికెట్లు వారికి వచ్చాయి. పేమెంట్ సమయంలో వచ్చిన సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగింది. అయితే, సదరు ఫ్యాన్స్ తమకు ఆయా టికెట్లను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి, వారి కోసం ఆ టికెట్ల ధరను చెల్లించడానికి అవకాశం ఇచ్చాం. పేమెంట్ ప్రక్రియను పూర్తి చేసేందుకు వారం రోజుల సమయం ఇచ్చాం’’ అని ఫిఫా తెలిపింది. అయితే, ఆ టికెట్ల ధర ఎంతనేది మాత్రం వెల్లడించలేదు.
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ టికెట్ రీసేల్ వెబ్సైట్లలో 2.2 మిలియన్ యూరోలు (భారత కరెన్సీ ప్రకారం.. రూ.21 కోట్లు) ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వాటిపై ఫిఫా ప్రెసిడెంట్ గియాన్ని స్పందించారు. ‘‘ఫుట్‌బాల్‌కు ఉన్న మార్కెట్ ప్రకారమే టికెట్ ధరలు ఉంటాయి. ప్రపంచంలోనే అత్యధిక ఎంటర్టైన్మెంట్ ఇచ్చే క్రీడ ఫుట్‌బాల్’’ అని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.