
ఇంటర్నెట్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఆసక్తి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం సీఎం విజయ్‌పై ఉన్న దృష్టి.. ఇప్పుడు అన్నామలై (K Annamalai) వైపు మళ్లింది. ఆయన ఇప్పటికే భాజపాను
ఇంటర్నెట్‌డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఆసక్తి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతకాలం సీఎం విజయ్‌పై ఉన్న దృష్టి.. ఇప్పుడు అన్నామలై (K Annamalai) వైపు మళ్లింది. ఆయన ఇప్పటికే భాజపాను వీడగా.. తన రాజకీయ భవిష్యత్తు గురించి తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ప్రముఖ నటుడు రజనీకాంత్ ప్రస్తావన తెచ్చారు. తనతో చేతులు కలపమని గతంలో సూపర్‌స్టార్ అడిగారన్నారు.
‘‘2024లో నేను భాజపాలో చేరడానికి ఒకరోజు ముందు రజనీకాంత్ నాకు ఫోన్ చేశారు. ఆయన నేతృత్వం వహిస్తున్న రాజకీయ ఉద్యమంలోకి రావాలని ఆహ్వానించారు. కానీ, నేను అప్పటికే భాజపా సీనియర్ నేత బీఎల్ సంతోష్‌కు మాటిచ్చా. అందుకే రజనీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించా. నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం బీఎల్ సంతోష్ ఇచ్చిన హామీనే. నా రాజకీయ ప్రవేశంపై ఉన్న ఊహాగానాలకు ముగింపు పలికేందుకు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాను. అయితే తమిళనాడు విషయంలో నా అభిప్రాయాలు.. భాజపా నాయకత్వం అభిప్రాయాలతో సరిపోలలేదు. ఈ విభేదాలను పరిష్కరించుకునేందుకు పార్టీ అగ్రనాయకత్వంతో 18 నెలలుగా ఎన్నో చర్చలు జరిపాను. ఇంక భాజపాకు భారంగా ఉండకూడదని అనుకున్నాను’’ అని అన్నామలై వివరించారు. ఇకపై స్వతంత్ర రాజకీయ మార్గంలో ముందుకువెళ్తానని, తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త బాటలు వేసేందుకు పోరాడతానని తెలిపారు.
గత ఏడాది డిసెంబర్లోనే నా రాజీనామా గురించి చెప్పాను. అయితే పార్టీ పెద్దలు నన్ను ఆపారు. ఎన్నికల బాధ్యతలు నిర్వహించమని సూచించారు. ఇప్పుడు నా రాజకీయాలు సామాన్యుడి లక్ష్యంగా ఉంటాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తాను. అప్పటివరకు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాను. ప్రధాని మోదీపై నాకు అపారగౌరవం ఉంది. భాజపా ఇప్పటివరకు నాపై ఉంచిన నమ్మకానికి, ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు’’ అని అన్నామలై (K Annamalai) వెల్లడించారు. అలాగే అన్నామలై మక్కల్ ఇయక్కమ్ (AMI) పేరిట రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. దానికి భారీ స్పందన వస్తోందని చెప్పారు.
అన్నామలై వెళ్లిపోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదని భాజపా (BJP) తమిళనాడు చీఫ్ నైనార్ నాగేంద్రన్ వెల్లడించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలోని 28 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం జరిగింది.