
కొత్త కారు కొనుగోలు చేయాలని ప్రణాళికలో ఉన్నవారికి మారుతి సుజుకి శుభవార్త చెప్పింది. ఈ జూన్ లో తమ ప్రీమియం నెక్సా శ్రేణి కార్లపై భారీ డిస్కౌంట్లు, ప్రయోజనాలను ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన
కొత్త కారు కొనుగోలు చేయాలని ప్రణాళికలో ఉన్నవారికి మారుతి సుజుకి శుభవార్త చెప్పింది. ఈ జూన్ లో తమ ప్రీమియం నెక్సా శ్రేణి కార్లపై భారీ డిస్కౌంట్లు, ప్రయోజనాలను ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్ఠంగా రూ.2.15 లక్షల వరకు ఆఫర్లను అందిస్తోంది. ఇన్విక్టో, గ్రాండ్ విటారా, బలెనో, ఫ్రాంక్స్, ఎక్స్ఎల్6, జిమ్నీ, ఇగ్నిస్ వంటి అన్ని ప్రధాన నెక్సా మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.ఇన్విక్టోపై అత్యధిక ప్రయోజనాలుఈ నెలలో అత్యధిక డిస్కౌంట్ మారుతి సుజుకి ప్రీమియం ఎంపీవీ అయిన ఇన్విక్టోపై లభిస్తోంది. ఈ కారుపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు మొత్తం ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో కన్స్యూమర్ బెనిఫిట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, అప్‌గ్రేడ్ లాయల్టీ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్లు భాగంగా ఉన్నాయి. నెక్సా లైనప్‌లో ఇదే అత్యధిక ఆఫర్ కావడం గమనార్హం.గ్రాండ్ విటారాపై ఆకర్షణీయ ఆఫర్లుఇన్విక్టో తర్వాత గ్రాండ్ విటారా ఎస్‌యూవీపై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లు వేరియంట్‌ను బట్టి మారుతున్నాయి.ఎంట్రీ-లెవల్ సిగ్మా పెట్రోల్ వేరియంట్‌పై రూ.1.35 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. డెల్టా పెట్రోల్ వేరియంట్ల (మాన్యువల్, ఆటోమేటిక్)పై రూ.1.25 లక్షల వరకు ఆఫర్లు అందిస్తున్నారు.జెటా, ఆల్ఫా, ఏడబ్ల్యూడీ వేరియంట్లను కొనుగోలు చేసేవారు రూ.85,000 వరకు ప్రయోజనాలతో పాటు ఐదేళ్ల ఉచిత ఎక్స్టెండెడ్ వారంటీని కూడా పొందుతారు.గ్రాండ్ విటారా లైనప్‌లోనే అత్యంత బలమైన ఆఫర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లపై అందుబాటులో ఉంది. ఢిల్లీలో ఈ వేరియంట్లను కొనుగోలు చేసేవారికి జీరో రోడ్ ట్యాక్స్ ప్రయోజనాన్ని అందిస్తున్నారు. దీని విలువ