
‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్’ను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రాజెక్ట్ కారణంగా అక్కడి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్’కు
‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్’ను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రాజెక్ట్ కారణంగా అక్కడి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్’కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆన్లైన్ క్యాంపెయిన్ చేపట్టారు.
న్యూఢిల్లీ, జూన్ 5: అండమాన్, నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ దీవిని ఒక వ్యూహాత్మక, ఆర్థిక, పర్యాటక కేంద్రంగా మార్చడం కోసం భారత ప్రభుత్వం ‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్’ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యుత్ ఉత్పాదన కేంద్రం, టౌన్షిప్ నిర్మాణం జరగనుంది. ‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్’ కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 80 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ప్రాజెక్ట్ కారణంగా అక్కడి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్’కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆన్లైన్ క్యాంపెయిన్ చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా #GreenOverGreed, #NicobarMatters హ్యాష్‌ట్యాగ్స్‌తో.. దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ప్రాజెక్ట్ కారణంగా నికోబార్ దీవుల్లో స్కూబా డైవింగ్‌తో పగడపు దిబ్బలను విధ్వంసం చేస్తున్నారంటూ రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త పార్టీ ప్రకటించిన అన్నామలై.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సై..
రామలింగా రెడ్డి రాజీనామా.. స్పందించిన సీఎం డీకే శివకుమార్