
Jhanvi Kapoor:పెద్ది సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ జాన్వీ కపూర్ తన అందమైన లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాక్లెట్ బ్రౌన్ రంగు చీరలో ఆమె కనిపించిన
Jhanvi Kapoor:పెద్ది సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ జాన్వీ కపూర్ తన అందమైన లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చాక్లెట్ బ్రౌన్ రంగు చీరలో ఆమె కనిపించిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చీర అందం మాత్రమే కాదు, దాని ధర కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
మట్టి రంగు ఛాయలతో రూపొందిన ఈ చీరలో సంప్రదాయం, రాజసపు హంగులు కలగలిపి కనిపించాయి. పాతకాలపు పెళ్లిళ్లలో కనిపించే శోభను గుర్తు చేసేలా ఈ డిజైన్ రూపొందించారు. చీరపై చేసిన సున్నితమైన చేతిపని ఎంబ్రాయిడరీ, ఆలివ్ గ్రీన్ బార్డర్, బంగారు రంగు డిజైన్లు దాని అందాన్ని మరింత పెంచాయి.
ఈ చీర పూర్తిగా చేతిపనితో తయారైన ప్రత్యేక డిజైన్‌గా చెబుతున్నారు. ఫ్యాషన్ వర్గాల అంచనా ప్రకారం ఈ చీర ధర సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో ఈ చీర గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
జాన్వీ తన లుక్‌ను చాలా సింపుల్‌గా, హుందాగా ఉంచారు. హెవీ మేకప్‌కు బదులుగా స్మోకీ ఐ మేకప్, సాఫ్ట్ ఐలైనర్, మస్కరా, బ్రౌన్ షేడ్ లిప్‌స్టిక్‌తో ఆకట్టుకున్నారు. చీరకు సరిపోయేలా బంగారు చెవిపోగులు ధరించి మరింత అందంగా మెరిశారు.
ఈ లుక్‌లో జాన్వీని చూసిన పలువురు అభిమానులు ఆమె తల్లి, దివంగత నటి శ్రీదేవిని గుర్తు చేసుకుంటున్నారు. సంప్రదాయ అందం, ఆధునిక ఫ్యాషన్ కలయికగా కనిపించిన ఈ స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే, ఇందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ అచియమ్మ పాత్రలో కనిపించనున్నారు. సంగీతాన్ని ఏఆర్ రెహ్మాన్ అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌తో పాటు జాన్వీ ఫ్యాషన్ ఎంపికలు కూడా ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.