
Ramalinga Reddy Resignation: కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నూతన మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తికి లోనైన కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి (Ramalinga Reddy), తన
Ramalinga Reddy Resignation: కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. నూతన మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తికి లోనైన కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి (Ramalinga Reddy), తన మంత్రి పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. డీకే శివకుమార్ (DK Shivakumar) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి.. అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే ఇది ఊహించని పెద్ద దెబ్బగా మారింది.
Read Also :Indi Alliance : ‘ఇండీ’ కూటమి భేటీకి DMK దూరం
రాష్ట్ర రాజధాని సమగ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ‘బెంగళూరు డెవలప్మెంట్’ (Bengaluru Development) శాఖను రామలింగారెడ్డి ఆశించారు. గత సిద్ధరామయ్య మంత్రివర్గంలో డీకే శివకుమార్ స్వయంగా ఈ శాఖను పర్యవేక్షించారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో శాఖల కేటాయింపుపై రామలింగారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విధానసౌధలో డీకే శివకుమార్ తో జరిగిన సమావేశం నుంచి ఆయన మధ్యలోనే బయటకు వచ్చేయడం ఆ గొడవకు పరాకాష్టగా నిలిచింది. డీకే శివకుమార్ ఈ ప్రతిష్టాత్మక బెంగళూరు డెవలప్మెంట్ శాఖను కృష్ణ బైరేగౌడకు కేటాయించి, రామలింగారెడ్డికి భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖను అప్పగించారు. ఈ కేటాయింపు ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసింది.
మంత్రివర్గ కేటాయింపులు జరిగిన కొద్దిసేపటికే అత్యవసర విలేకరుల సమావేశం (Press Meet) ఏర్పాటు చేసిన రామలింగారెడ్డి, తన రాజీనామా లేఖను డీకే శివకుమార్ కు పంపినట్లు వెల్లడించారు. “నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి, మీకు కృతజ్ఞతలు. కానీ నేను నా ఆత్మసాక్షికి వ్యతిరేకంగా వ్యవహరించలేను. నా ఆత్మసాక్షికి అనుగుణంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లేవు. నా రాజీనామాను దయచేసి ఆమోదించండి. ఇకపై నేను కేవలం ఎమ్మెల్యేగా, పార్టీ సాధారణ కార్యకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తాను” అని లేఖలో స్పష్టం చేశారు. 2023లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడే బెంగళూరు డెవలప్మెంట్ శాఖను తనకు ఇస్తామని డీకే శివకుమార్ హామీ ఇచ్చారని, ఆ మాట నెరవేరకపోవడం వల్లే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రామలింగారెడ్డి గుర్తుచేశారు.
Telangana Anganwadi : అంగన్వాడీలకు వేసవి సెలవులు పొడిగింపు?
Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ చోటు దక్కేనా?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Annamalai Resignation: బీజేపీ పార్టీకి అన్నామలై గుడ్‌బై!
AP Politics: పవన్ కళ్యాణ్‌కు కేవీపీ రామచంద్ర రావు బహిరంగ లేఖ
Telangana Politics: పవన్ కళ్యాణ్ తెలంగాణ వైఖరిపై రామచందర్ రావు క్లారిటీ
Another Trinamool Mayor Quits : తృణమూల్ మేయర్ రాజీనామా..మమతాకు గట్టి షాక్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటి?
Mamatha’s Political Empire : కుప్పకూలుతున్న దీదీ రాజకీయ సామ్రాజ్యం