
మంగళగిరి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో శుక్రవారం మెగా జాబ్ మేలా జరుగుతోంది. మంత్రి నారా లోకేశ్ చొరవతో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు
. మంగళగిరిలోని వీజే జూనియర్ కాలేజీలో ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ జాబ్ మేలా సాయంత్రం వరకూ జరగనుంది.
ఈ జాబ్ మేళా ద్వారా 950కి పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ వంటి విద్యార్హతలు కలిగిన 18 నుంచి 40 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి అర్హతలను బట్టి నెలకు 15 వేల నుంచి 40 వేలరూపాయల వరకూ వేతనం లభిస్తుంది. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజు ఫొటోలను వెంట తీసుకురావాలి.
మెమోరియల్ టోర్నమెంట్లో భారతీయుల జోరు: 33వ స్థానంలో ఆరోన్ రాయ్, అక్షయ్ భాటియా!
మెట్రో సిటీలో రూ.1.4 లక్షల జీతమా? సొంతూరిలో రూ.40 వేల ప్రశాంతతా? మీ ఛాయిస్ ఏంటి?
.