
MATA : మన అమెరికా తెలుగు సంఘం (Mana American American Telugu Association – MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘మటా 2nd కన్వెన్షన్ ‘26’ (MATA 2nd Convention ‘26) మహాసభలకు సర్వం సిద్ధమైంది. ఈ
MATA : మన అమెరికా తెలుగు సంఘం (Mana American American Telugu Association – MATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘మటా 2nd కన్వెన్షన్ ‘26’ (MATA 2nd Convention ‘26) మహాసభలకు సర్వం సిద్ధమైంది. ఈ సంవత్సరం జూన్ 19 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు రెండు రోజుల పాటు పెన్సిల్వేనియాలోని ‘ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్’ (100 Station Ave, Oaks, PA-19456) లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ప్రధాన ఆకర్షణలు.. ఈ మహాసభల్లో ప్రవాస తెలుగు వారిని అలరించడానికి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వినోద కార్యక్రమాలను భారీ ఎత్తున ప్లాన్ చేశారు. భద్రాచల సీతారామ కళ్యాణం భక్తుల కోసం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) , ప్రముఖ సింగర్ రామ్ మిరియాల లైవ్ కాన్సెర్ట్‌లు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ‘మటా సింగింగ్ స్టార్’ పోటీలతో పాటు మ్యాట్రిమోనీ (Matrimony) విభాగం, యూత్ (Youth) విభాగాలు ఉంటాయి. సీఎంఈ (CME), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బిజినెస్, పొలిటికల్ , లీగల్ ఫోరమ్‌లను నిర్వహించనున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, ఫ్యాషన్ షో, ఉమెన్ ఫోరమ్స్, అవార్డుల ప్రధానోత్సవం (Excellence Awards) , సెలబ్రిటీ మూవీ స్టార్స్ సందడి చేయనున్నారు. వెండర్స్ & ఎగ్జిబిట్స్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నిర్వాహక కమిటీ .. ఈ వేడుకలను ‘మటా’ ప్రెసిడెంట్ రమణ కిరణ్ దూదిపాక, కన్వీనర్ శ్రీధర్ గూడాల, కో-కన్వీనర్లు టోని జన్ను, దాము గేదెల , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గూడూరులతో కూడిన కోర్ & ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. వారితో పాటు కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గనగోని (ఫౌండర్), ప్రదీప్ సమల (ఫౌండర్), జితేందర్ రెడ్డిలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ మహాసభలకు ‘xpat.money’ , ‘MSN Realty’ సంస్థలు మెగా స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. టికెట్లు , వెండర్ రిజిస్ట్రేషన్ల కోసం చిత్రంలో క్యూఆర్ (QR) కోడ్లను అందుబాటులో ఉంచారు. మరిన్ని వివరాల కోసం మటా హెల్ప్‌లైన్ నంబర్లను (+1 888-7MATAUS, +1 888-762-8287) సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.