
ఇంటర్నెట్డెస్క్: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. మార్కెట్లో వీగన్ ఆహార పదార్థాలను గుర్తించడం సులభతరం చేసేలా లోగోను ప్రవేశపెట్టింది. ఆమోదం
ఇంటర్నెట్డెస్క్: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. మార్కెట్లో వీగన్ ఆహార పదార్థాలను గుర్తించడం సులభతరం చేసేలా లోగోను ప్రవేశపెట్టింది. ఆమోదం లభించిన అన్ని వీగన్ ఆహార పదార్థాల ప్యాకేజీలపై వీగన్ లోగో తప్పనిసరిగా ఉండాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. వచ్చే ఏడాది జులై 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఆహార పదార్థాలపై పారదర్శకత, వినియోగదారుల విశ్వాసాన్ని బలోపేతం చేయడం, లేబులింగ్ ప్రమాణాలను మరింత మెరుగ్గా పాటించేలా చూడటమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకారం.. ఒక బాక్సులో ‘V’ అనే అక్షరం.. దాని పైభాగంలో ఒక చిన్న మొక్క చిహ్నం ఉంటాయి. దానికింద ‘VEGAN’ అని ఉంటుంది. ఇవన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉండాలి. వీగన్ ఆహార ఉత్పత్తులకు మాత్రమే ఈ లోగోను వినియోగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.