
ఇంటర్నెట్‌డెస్క్: పంజాబ్ (Punjab)లో ఘోరం చోటుచేసుకుంది. ఆఫీసులో అందరూ చూస్తుండగానే.. తన మాజీ ప్రియురాలిని ఓ ప్రేమోన్మాది అతి దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు
ఇంటర్నెట్‌డెస్క్: పంజాబ్ (Punjab)లో ఘోరం చోటుచేసుకుంది. ఆఫీసులో అందరూ చూస్తుండగానే.. తన మాజీ ప్రియురాలిని ఓ ప్రేమోన్మాది అతి దారుణంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటియాలాకు చెందిన డింపుల్ (30) మోహాలీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. అదే కంపెనీలో సహోద్యోగిగా ఉన్న హర్జిందర్ సింగ్ (39)తో మూడేళ్లుగా ప్రేమలో ఉంది. అయితే ఇటీవలే వీరు విడిపోయినట్లు తెలుస్తోంది. దీన్ని తట్టుకోలేకపోయిన హర్జిందర్ సింగ్.. డింపుల్‌తో మళ్లీ కలిసేందుకు అనేకసార్లు ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో మానసిక వేదనకు గురయ్యాడు. గురువారం సాయంత్రం ఆవేశంగా కంపెనీ లోపలికి వచ్చిన హర్జిందర్ సింగ్ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. వెంబడించి దాదాపు 20 సార్లు కత్తితో పొడిచి హతమార్చాడు. తోటి ఉద్యోగులు అతడిని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆ తర్వాత నిందితుడు కూడా తనని తాను కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన భయంకరమైన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఈ ఘటనతో కార్యాలయంలోని ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువురినీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే డింపుల్ చనిపోగా.. హర్జిందర్ సింగ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.