
Peddi Collection Day 1 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటించింది.
Peddi Collection Day 1 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గురువారం (జూన్ 4న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తొలి రోజు ఈ చిత్రం 135.36 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్రం ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది. చరణ్ నటనకు సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. అదే సమయంలో చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్రం రానున్న రోజుల్లో భారీ వసూళ్లను సాధించే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. *Mrunal Thakur : కొంటె చూపు, అందాలతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న మృణాల్ ఠాకూర్.. జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించారు. *Tollywood : థియేటర్లు ఖాళీ..! టికెట్ రేట్లే కారణమా? Box office CHAMPION - #PEDDI SIR 💥💥💥💥💥💥 135.36 CR+ GROSS WW on Day 1 ❤️🔥❤️🔥 Meet #PEDDI now in cinemas ❤️🔥 Book your tickets now 💥💥 — PEDDI (@PeddiMovieOffl) June 5, 2026