
గురువారం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం వర్షం విరామ సమయంలో కామెంట్రీ బాక్స్‌లో వైభవ్ సూర్యవంశీ గురించి చర్చ Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026...
గురువారం లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం వర్షం విరామ సమయంలో కామెంట్రీ బాక్స్‌లో వైభవ్ సూర్యవంశీ గురించి చర్చ Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అదరగొట్టాడు. 776 పరుగులతో టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఐపీఎల్ ముగిసినా కూడా వేరే దేశంలో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు కూడా అతడి పేరే వినిపిస్తోందంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య లార్డ్స్ వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో వైభవ్ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. *Rishabh Pant : వైస్ కెప్టెన్సీ ఊస్ట్.. రిషబ్ పంత్‌కు గౌతమ్ గంభీర్ క్లాస్.. ఓ సీనియర్ ఆటగాడిగా నువ్వు.. లార్డ్స్ వేదికగా గురువారం ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ తొలి రోజు ఆట సమయంలో వర్షం కారణంగా విరామం వచ్చింది. ఈ సమయంలో కామెంటరీ బాక్స్‌లో ఉన్న మాజీ క్రికెటర్లు ఇయాన్ వార్డ్, నాసర్ హుస్సేన్, సైమన్ డౌల్‌ల మధ్య వైభవ్ సూర్యవంశీకి మధ్య చర్చ జరిగింది. అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. "Open the batting with Sooryavanshi!" 😅👀 — Sky Sports Cricket (@SkyCricket) June 4, 2026 భారత టెస్టు జట్టులో అతడికి త్వరగా చోటు కల్పించాల్సిందేనని సైమన్ డూల్ అన్నాడు. ఆ రోజు ఎంతో దూరంలో ఉండకపోవచ్చునని చెప్పుకొచ్చాడు. *Vaibhav Sooryavanshi : 15 ఏళ్లకే కోట్లు సంపాదించిన వైభవ్ సూర్యవంశీ.. మైనర్లు కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలా? ఇదిలా ఉంటే.. భారత జట్టు ఈ నెలలో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌లో పర్యటించనుంది. పర్యటనకు వెళ్లే జట్టును శనివారం సెలక్టర్లు ప్రకటించనున్నారు. ఈ జట్టులో వైభవ్‌కు చోటు దక్కవచ్చుననే వార్తలు వస్తున్నాయి.