
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
IVY County Residential: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నేషనల్ క్యాపిటల్ రీజియన్ నోయిడాలోని ఐవీ కౌంటీ అపార్ట్మెంట్ సముదాయంలోని 12వ అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలను అగ్ని మాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు.
A టవర్లోని 12వ అంతస్తు ఫ్లాట్‌లోని కూలర్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. ఉదయం సుమారు ఏడున్నర ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు కమ్ముకుపోవడంతో నివాసితులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. భవనంలోని ఇతర ఫ్లాట్లలో ఉన్న వారిని అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
మంటలను అదుపులోకి తీసుకురావడాని తీవ్రంగా శ్రమిస్తున్న ఫైర్ బృందం... ప్రస్తుతం మంటలు చెలరేగడానికి గల కారణాలు పూర్తిగా అదేనా కాదా అనే విషయాలు తెలియరాలేదు. ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణనష్టం, ఆస్థినష్టం వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని మాలవీయ నగర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటనపై విచారణ కొనసాగుతున్న వేళే, తాజాగా నోయిడాలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం భవనాల అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది.నోయిడాలోని సెక్టార్-113 పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన సంభవించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.