
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Telangana Weather Update: తెలంగాణలో వాతావరణం మారిపోయింది. కేరళంలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ ప్రభావంతో తెలంగాణలో వానలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది. నిన్న ఉమ్మడి ఆదిలాబాద్,నిజామాబాద్, కరీంనగర్ , వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో కూడా ఓ మోస్తరు వర్షం పడింది.
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..ఎండలకు ఇక బైబై..
మొత్తంగా నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఎండ తీవ్రతతో, ఉక్కపోతతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. వాతావరణ శాఖ ముందుగా చెప్పినట్టుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి రుతుపవనాల కదలికల వల్ల ఏర్పడిన ద్రోణి ప్రభావం తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ పై స్పష్టంగా కనిపిస్తోంది.
దక్షిణ తెలంగాణలో ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తున్నాయి. సాయంత్రం 4 గంటల సమయం నుంచి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో జల్లులు మొదలవుతాయని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ వర్షాలు నేడు తెల్లవారుజాము వరకు నిరంతరాయంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షం పడే సమయంలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కానుండగా.. గాలిలో తేమ శాతం 42 శాతంగా ఉండనుందన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.