
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
AP TET Exams: ఆంధ్ర ప్రదేశ్‌లో టెట్ పరీక్షను ఆన్లైన్లో రోజుకు రెండు విడతలుగా నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు మొదలై 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకెండ్ సెషన్ పరీక్ష నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు తీర్పుతో DSC పరీక్ష రాయబోయే అభ్యర్థులు, ప్రస్తుతం సర్వీసులో ఉన్న టీచర్లు టెట్ రాయాల్సి వుంటుంది.
టెట్ దరఖాస్తుల ఫీజ్ చెల్లింపులు, దరఖాస్తుల సమర్పరణ నేటి నుంచి జులై 5 వరకు ఉంటుంది. జులై 15 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్ ఉంటుంది. జులై 25 నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్.. ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల, ఆగస్టు 25 నుంచి 31 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 8న తుది కీ విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్లో భాగంగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం DSC–2026 నోటిఫికేషన్ అక్టోబర్ 2026లో జారీ చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. AP TET–2026కు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ ఆశావహులందరికీ, ప్రస్తుతం సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థుల కోసం నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్, సిలబస్, సూచనలతో పాటుగా విధివిధానాలు, ఇతర వివరాలను వెబ్సైట్ లో ఉంచామన్నారు.
గతేడాది సెప్టెంబర్ 1న సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యాహక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులై ఐదేళ్లకుపైగా సర్వీస్ ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని చెప్పింది. అది కూడా రెండేళ్లలోపు తప్పనిసరిగా టెట్‌పాస్ కావాలని తీర్పు ఇచ్చింది. ఉద్యోగంల కొనసాగాలన్నా, ప్రమోషన్లకు సంబంధించి టెట్ పాస్ కావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ఉపాధ్యాయులు ఆందోళన చెందారారు. ఈ మేరకు అయితే ఈ తీర్పును మొత్తం 69 ఉపాధ్యాయ సంఘాలు సవాల్ చేశాయి.. రివ్యూ పిటిషన్లను దాఖలు చేశారు. మే 13న విచారణ జరిపిన కోర్టు పిటిషన్లను కొట్టేసింది. కాకపోతే టెట్‌పాస్ కావడానికి మూడేళ్లు గడువు పెంచింది. ఇన్‌సర్వీస్ టీచర్లు టెట్ పాస్ కావడానికి ఆగస్టు 31 వరకు గడువు పొడిగించింది. కనీసం ప్రతి రెండేళ్లకోసారి టెట్‌ను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.