
సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టి మెగాఫోన్ పట్టి మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సన.
సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టి మెగాఫోన్ పట్టి మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సన. ఆ సినిమా సాధించిన భారీ విజయం సాధించడంతో రెండో సినిమాకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు బుచ్చి. జూన్ 4 న విడుదలైన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో దర్శకుడు బుచ్చిబాబుపై విమర్శలు వైరల్ అవుతున్నాయి.
బుచ్చిబాబు మొదటి సినిమా ‘ఉప్పెన’ క్లైమాక్స్‌లో కథ డిమాండ్ మేరకు హీరో పాత్రకు అంగచ్ఛేదనం చేసినట్టు చూపించి సంచలనం సృష్టించారు. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన ‘పెద్ది’ సినిమాలో కూడా రామ్ చరణ్ పాత్ర కాలు కోల్పోయి పారా ఒలంపిక్స్ లో మెడల్ సాధిస్తాడు. ఇప్పుడు దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. “బుచ్చిబాబు గారు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?” అంటూ నెట్టింట ఫన్నీ అండ్ సీరియస్ చర్చలు మొదలయ్యాయి. కానీ ఒక దర్శకుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న బుచ్చిబాబు సన కెరీర్‌కు ఇలాంటి విమర్శలు ‘బాడీ పార్ట్ కట్టింగ్’ సెంటిమెంట్ ముద్ర పడటం అంత మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథలో ఎమోషన్ పండించడానికి ఇలాంటి వైకల్యాలను పదే పదే చూపించడం వల్ల రాబోయే రోజుల్లో బుచ్చి కథలపై ప్రేక్షకులకు ముందే ఒక అంచనా వచ్చేసే ప్రమాదం ఉంది. దర్శకుడిగా బుచ్చిబాబు తన తదుపరి చిత్రాలలో ఇలాంటి విమర్శలకు తావు లేకుండా వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో రావాలని ఆశిద్దాం.