
ఐపీఎల్ జట్ల ఎంపికలో ఫ్రాంచైజీల యజమానుల జోక్యం ఎంతవరకు ఉంటుంది? ఈ విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతున్నా, స్పష్టమైన ఆధారాలు మాత్రం బయటకు రాలేదు.
ఐపీఎల్ జట్ల ఎంపికలో ఫ్రాంచైజీల యజమానుల జోక్యం ఎంతవరకు ఉంటుంది? ఈ విషయంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతున్నా, స్పష్టమైన ఆధారాలు మాత్రం బయటకు రాలేదు. అయితే, ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్లో జట్టు ఎంపికలో యాజమాన్యం జోక్యం చేసుకుందని, ఓనర్లకు నచ్చిన ఆటగాడి కోసం తనను పక్కనపెట్టారని ఆరోపించాడు.ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ లివింగ్‌స్టోన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. "ఐపీఎల్ 2026 వేలంలో ముంబై ఇండియన్స్‌కు గట్టి పోటీనిచ్చి సలీల్ అరోరా అనే యువ ఆటగాడిని మా ఫ్రాంచైజీ దక్కించుకుంది. అతనంటే మా ఓనర్లకు చాలా ఇష్టం. దీంతో అతడిని తుది జట్టులో కచ్చితంగా ఆడించాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఒక దశలో కెప్టెన్ కమిన్స్ అందుబాటులో లేనప్పుడు మేము ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగాం. అప్పుడు కూడా నాకు అవకాశం రాలేదు" అని లివింగ్‌స్టోన్ వివరించాడు.ఈ విషయంపై తాను కోచ్ డాన్ వెటోరీని ప్రశ్నించగా, అసలు విషయం చెప్పాడని లివింగ్‌స్టోన్ తెలిపాడు. "కోచ్ వెటోరీ నాతో మాట్లాడుతూ.. 'ఆ కుర్రాడంటే ఓనర్లకు చాలా ఇష్టం. కమిన్స్ తిరిగి వచ్చినా సరే, జట్టు కూర్పులో మార్పులు ఉండవు' అని స్పష్టంగా చెప్పారు. ఆయన నిజాయతీగా చెప్పడంతో, గాయాల వంటివి జరిగితే తప్ప నాకు ఆడే అవకాశం రాదని అర్థమైంది. దాంతో నా ఆలోచనా విధానం కూడా మారిపోయింది" అని పేర్కొన్నాడు.లివింగ్‌స్టోన్ ఇంకా మాట్లాడుతూ..