
AP TET 2026 Schedule Released : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదలైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా వివరాలను వెల్లడించారు. రోజుకు రెండు విడతలుగా టెట్ ఆన్లైన్లో నిర్వహించనున్నారు. అయితే, ఈ టెట్ పరీక్షను సుప్రీంకోర్టు తీర్పుతో డీఎస్సీ పరీక్ష రాయబోయే అభ్యర్థులతో పాటుగా ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులూ టెట్ రాయల్సిందే. షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే.. జూన్ 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూన్ 5 నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఫీజుల చెల్లింపు ప్రక్రియకూ అవకాశం ఉంటుంది. జులై 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు పరీక్షల నిర్వహణ ఉంటుంది. రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుంది. ప్రాథమిక కీ ఆగస్టు 24న విడుదల చేస్తారు. ఫైనల్ కీ సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన టెట్ ఫలితాలు వెల్లడించనున్నారు. మరిన్ని వివరాల కోసం tet2dsc.apcfss.in ను సందర్శించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక జాబ్ క్యాలెండర్లో భాగంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకంకోసం డీఎస్సీ -2026 నోటిఫికేషన్ అక్టోబర్ 2026లో జారీ చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. AP TET–2026కు సిద్ధమవుతున్న ఉపాధ్యాయ ఆశావహులందరికీ, ప్రస్తుతం సేవలందిస్తున్న అధ్యాపకులకునా నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి, నాణ్యమైన బోధనా ప్రమాణాలను నిర్ధారించడానికి ఏపీ టెట్ – 2026ను ప్రకటించడం నాకు చాలా ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు
.