
సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... వచ్చేఏడాదికి సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు
అక్షర ఆంధ్రలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలి మధ్యాహ్న భోజన పథకంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫీడ్ బ్యాక్ అందించాలి పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష అమరావతి: రాష్ట్రంలో గత ఏడాది చేపడుతున్న అక్షర ఆంధ్ర కార్యక్రమం సత్పలితాలనిస్తోంది. ఉద్యమంలా పనిచేసి వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధనకు అధికారులంతా కలసికట్టుగా కృషిచేయాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 2024నాటికి రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దేశంలోనే అట్టడుగున కేవలం 72.6శాతం ఉండగా, గత ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా 25లక్షలమంది అక్షరాస్యులుగా మారారు, ఒక్క ఏడాదిలో ఇంత భారీగా అక్షరాస్యత సాధించడంపై ఎపి కృషిని కేంద్రప్రభుత్వం అభినందించినట్లు అధికారులు తెలుపగా, మంత్రి లోకేష హర్షం వ్యక్తంచేశారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన వయోజన విద్య పరీక్షా ఫలితాల్లో 10శాతం పెరిగి 82.1శాతానికి చేరుకుంది, 2027 సెప్టెంబర్ నాటికి నూరుశాతం అక్షరాస్యత సాధన దిశగా పనిచేయాలని మంత్రి కోరారు. 2027 మార్చినాటికి మరో 25లక్షలమందిని, సెప్టెంబర్ నాటికి మిగిలిన 27లక్షలమంది అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం 11 ప్రభుత్వశాఖల సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంలో శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి, పెద్దఎత్తున ప్రజలను చైతన్యవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ ఏడాది ఇంటర్మిడియట్ రెండో సంవత్సరంలో మంచి ఉత్తీర్ణత సాధించామని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ రంజిత్ బాషా అన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఇంటర్మడియట్ లో సుమారు 10వేల అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. సంకల్ప్ అకడమిక్ సపోర్ట్ ప్రోగ్రామ్


.webp)







