© 2026 nimisham.in

తెలంగాణ విద్యారంగంలో అమలు చేస్తున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పర్ ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) 2.0 ర్యాంకింగ్లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. హైదరాబాద్, జులై 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ విద్యారంగంలో (Telangana Education) అమలు చేస్తున్న సంస్కరణలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం (Central Govt) విడుదల చేసిన పర్ ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (PGI) 2.0 ర్యాంకింగ్లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. గతంలో 31వ స్థానంలో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం 26వ స్థానానికి చేరుకుంది. అలాగే PGI స్కోరు 552.5 నుంచి 599.7కు పెరగడం రాష్ట్ర విద్యా వ్యవస్థలో నమోదైన మెరుగుదలకు నిదర్శనంగా నిలిచింది. దీంతో తెలంగాణ ఆకాంక్షి-1 విభాగం నుంచి ప్రచేష్ట-3 విభాగంలోకి చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణల ఫలితంగా జనగాం, మంచిర్యాల జిల్లాలకు ఉత్తమ్-3 గుర్తింపు లభించింది. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి 10,006 మంది కొత్త ఉపాధ్యాయులను నియమించగా, 25,950 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. అదేవిధంగా 1.12 లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అందించి బోధన నాణ్యతను మరింత మెరుగుపరిచింది. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం 120 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను (KGBVS) ఇంటర్ స్థాయికి అప్గ్రేడ్ చేసింది. మరో 93 కేజీబీవీలకు యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఎక్సలెన్స్ గుర్తింపు లభించింది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) ఫలితాల్లో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, గణిత విభాగాల్లో విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరిచారు. సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ 1,132 పాఠశాలల్లో ICT ల్యాబ్లు, 2,036 పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, 4,249 ప్రాథమిక పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ లిటరసీ పాఠ్యాంశాలను
ప్రవేశపెట్టారు. ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధి కోసం ఫిన్లాండ్, జర్మనీ దేశాలకు అధ్యయన పర్యటనలు కూడా నిర్వహించారు. ఈ చర్యల ఫలితంగా పదోతరగతి ఉత్తీర్ణత శాతం 95.15కు చేరుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 5,731 ప్రభుత్వ పాఠశాలలు 100 శాతం ఫలితాలు నమోదు చేశాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలో చేపట్టిన విద్యా సంస్కరణలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు: పవన్ కల్యాణ్
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలో భారీ ప్రక్షాళన.. అధికారులపై వేటు
Read Latest AP News And Telangana News And National News