
Mahabubnagar Bike Stunts Arrest: మహబూబ్నగర్ పట్టణంలో బైకులతో ప్రమాదకర స్టంట్లు చేస్తూ, రీల్స్ పిచ్చితో రోడ్లపై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న యువకుల ఆటకట్టించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ (SP) శ్రీమతి డి.
జానకి, ఐపీఎస్ గారి కఠిన ఆదేశాల మేరకు, రోడ్డు భద్రతలో భాగంగా పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదకర వాహన విన్యాసాలకు పాల్పడుతున్న ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Read Also: CM Makhtal Tour:లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం:సీఎం ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ (CI) మహమ్మద్ ఇజాజుద్దీన్ మాట్లాడుతూ..
బహిరంగ రోడ్లపై, జనావాసాల మధ్య బైక్ స్టంట్లు చేయడం వల్ల స్టంట్లు చేసే వారితో పాటు రహదారిపై ప్రయాణించే సాధారణ ప్రజల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.
Mahabubnagar Bike Stunts Arrest: యువత రీల్స్ వ్యామోహంలో పడి విలువైన జీవితాలను రోడ్డు ప్రమాదాల బారిన పడేసి నాశనం చేసుకోవద్దని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా మైనర్ (తీరని వయసు) పిల్లలకు బైకులు, కార్లు ఇవ్వడం గమనించిన పక్షంలో..
మోటార్ వాహనాల చట్టం ప్రకారం వారి తల్లిదండ్రులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేస్తూ, వాటిని వీడియోల రూపంలో సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిని అస్సలు ఉపేక్షించేది లేదని, వాహనాలను సీజ్ చేయడంతో పాటు జైలుకు పంపుతామని ఆయన స్పష్టం చేశారు.
CM Makhtal Tour:లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తాం:సీఎం! Nellore Crime News:యువకుడిని చంపేందుకు ప్లాన్.. నెల్లూరులో 10 మంది అరెస్ట్!