
రాజమహేంద్రవరంలో ఇటీవల ఒక మహిళపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వీడియోపై ఆరా తీశామని, ఆ దాడి చేసింది.... మాజీ ఎంపీ భరత్ అనుచరుడే.. అతనిపై రౌడీషీట్ సాక్ష్యాలతో వెల్లడించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరం/ సిటీ, జూన్ 4(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో ఇటీవల ఒక మహిళపై దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన వీడియోపై ఆరా తీశామని, ఆ దాడి చేసింది మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అనుచరుడేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు.
దీనిని అడ్డుపెట్టుకుని రాజమహేంద్రవరంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, ఇదంతా కూటమి ప్రభుత్వ నిర్వాకమని వైసీపీ మాజీ ఎంపీ భరత్ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేసి బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన సమావేశంలో ఈ ఘటన సాక్ష్యాధారాలను ఎమ్మెల్యే మీడియాకు చూపించారు.
తన పార్టీ కార్యకర్త కాశి దాడి చేస్తే.. తానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చిల్లర రాజకీయాలు చేశారని భరత్‌పై మండిపడ్డారు
.