
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Massive Fire At Bihar Hospital 3 Dead: ఇటీవల జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న ఢిల్లీ మాల్వియా నగర్‌లోని ఒక హోటల్లో జరిగిన ప్రమాదంలో 20 మంది మరణించగా, చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి.
అదే క్రమంలో ఈరోజు ఉదయం బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు రోగులు సజీవ దహనం అయ్యారు. ఆసుపత్రిలో చిక్కుకున్న పలువురిని రిస్క్యూ టీమ్ వెంటనే ఆపరేషన్ చేపట్టి బయటకు తీసుకువచ్చింది.
ముజఫర్‌పూర్ బ్రహ్మపురాలోని ప్రసాద్ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఐదవ అంతస్తులో ఉన్న ఐసియూ వార్డులో మంటలు మొదలవడంతో పొగ అంతటా విస్తరించింది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ మంటలు వ్యాపించినట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా రోగులు గాయపడటంతో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.
తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, రిస్క్యూ టీమ్‌లు శ్రమించి బాధితులను కాపాడారు. కిటికీలు, తలుపులు పగలగొట్టి మెట్ల ద్వారా వారిని బయటకు తీసుకువస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఐసీయూ వార్డులో షాక్ సర్క్యూట్ జరగడంతో ఐసీయూ వార్డు అంతా దట్టమైన పొగతో నిండిపోయిందని ఒక ఆపరేషన్ అధికారి మీడియాకు తెలిపారు.
ఈ ఘటనలో పలువురు రోగులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. READ ALSO: మాల్వీయా నగర్ రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది మృతి, ప్రధాని దిగ్భ్రాంతి..! READ ALSO: రెప్పపాటులో ఘోరం..
.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి