
Ram Charan : సాధారణంగా తమిళ హీరోలు, స్టార్ హీరోలు సైతం ఎలాంటి పాత్ర అయినా చేస్తారు. సినిమాల్లో ఎంత కింద స్థాయి పాత్ర అయినా చేయడానికి రెడీ అవుతారు. దానికోసం ఎంతైనా కష్టపడతారు. మట్టిలో దొర్లాడే పాత్రలు, అడుక్కునే లాంటి పాత్రలు సైతం తమిళ హీరోలు చేస్తారు. తమిళ, మలయాళ సినిమాలు రూటెడ్ గా ఉంటాయని, రియాలిటీకి దగ్గరగా ఉంటాయని అంటారు. మన తెలుగు ఆడియన్స్ సైతం తమిళ హీరోలను అలాంటి పాత్రలు చేసినందుకు పొగుడుతారు. ధనుష్ బిచ్చగాడుగా కూడా చేసాడని, విక్రమ్ అయితే అన్ని డీ గ్లామరైజ్ పాత్రలు చేసారని, సూర్య విభిన్న పాత్రలు చేసాడని, కమల్ హాసన్ అయితే నటనకు ప్రాణం పోస్తారని.. పలువురు తమిళ స్టార్ హీరోలు చేసే డీ గ్లామరైజ్ పాత్రలను ఓ రేంజ్ లో పొగుడుతారు తెలుగు వాళ్ళు. అక్కడి వరకు ఓకే కానీ కొంతమంది తెలుగు నెటిజన్లు తమిళ హీరోలని పొగుడుతూ మన తెలుగు హీరోలను తక్కువ చేస్తూ మాట్లాడతారు. తెలుగు హీరోలు ఇలాంటి పాత్రలు చేయలేరు, కేవలం కమర్షియల్ సినిమాలే చేస్తారు అని తిడుతూ పోస్టులు పెడతారు. సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు? చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే.. అయితే ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమాలో మన తెలుగులో ఏ స్టార్ హీరో చేయని డేరింగ్ సీన్స్ చేసారు. అసలు ఇలాంటి కథ, క్లైమాక్స్ కి ఒప్పుకోవడమే గ్రేట్. ఫ్యాన్స్ గురించి ఆలోచించకుండా ఇలాంటి క్లైమాక్స్, సెకండ్ హాఫ్ చేసారు అంటే రామ్ చరణ్ చాలా ధైర్యం చేసినట్టే. సినిమాలో కొన్ని సీన్స్ అయితే తమిళ హీరోలని మించి చేసాడు అని చెప్పొచ్చు. డాక్టర్ కాళ్ళు పట్టుకునే సీన్, హాస్పిటల్ లో సీన్, ముందు నుంచి అనుకున్నట్టే కాలు సీన్స్, ఢిల్లీలో చెరుకురసం బండి దగ్గర పనిచేసే సీన్స్,ఇక కుస్తీ పోటీల్లో మట్టిలో, బురదలో పోరాడటం.. అసలు ఇవన్నీ ఓ తెలుగు
Telugu » Movies » Ram Charan Done A Fantastic Performance In Peddi Over Tamil Heros Will Telugu Audience Appreciate Charan
Ram Charan : సాధారణంగా తమిళ హీరోలు, స్టార్ హీరోలు సైతం ఎలాంటి పాత్ర అయినా చేస్తారు. సినిమాల్లో ఎంత కింద స్థాయి పాత్ర అయినా చేయడానికి రెడీ అవుతారు. దానికోసం ఎంతైనా కష్టపడతారు. మట్టిలో దొర్లాడే పాత్రలు, అడుక్కునే లాంటి పాత్రలు సైతం తమిళ హీరోలు చేస్తారు. తమిళ, మలయాళ సినిమాలు రూటెడ్ గా ఉంటాయని, రియాలిటీకి దగ్గరగా ఉంటాయని అంటారు. మన తెలుగు ఆడియన్స్ సైతం తమిళ హీరోలను అలాంటి పాత్రలు చేసినందుకు పొగుడుతారు.
ధనుష్ బిచ్చగాడుగా కూడా చేసాడని, విక్రమ్ అయితే అన్ని డీ గ్లామరైజ్ పాత్రలు చేసారని, సూర్య విభిన్న పాత్రలు చేసాడని, కమల్ హాసన్ అయితే నటనకు ప్రాణం పోస్తారని.. పలువురు తమిళ స్టార్ హీరోలు చేసే డీ గ్లామరైజ్ పాత్రలను ఓ రేంజ్ లో పొగుడుతారు తెలుగు వాళ్ళు. అక్కడి వరకు ఓకే కానీ కొంతమంది తెలుగు నెటిజన్లు తమిళ హీరోలని పొగుడుతూ మన తెలుగు హీరోలను తక్కువ చేస్తూ మాట్లాడతారు. తెలుగు హీరోలు ఇలాంటి పాత్రలు చేయలేరు, కేవలం కమర్షియల్ సినిమాలే చేస్తారు అని తిడుతూ పోస్టులు పెడతారు.
Also Read : Peddi Twitter Review : ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా చూసిన ఆడియన్స్ ఏమంటున్నారు? చరణ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే..
అయితే ఇప్పుడు రామ్ చరణ్ పెద్ది సినిమాలో మన తెలుగులో ఏ స్టార్ హీరో చేయని డేరింగ్ సీన్స్ చేసారు. అసలు ఇలాంటి కథ, క్లైమాక్స్ కి ఒప్పుకోవడమే గ్రేట్. ఫ్యాన్స్ గురించి ఆలోచించకుండా ఇలాంటి క్లైమాక్స్, సెకండ్ హాఫ్ చేసారు అంటే రామ్ చరణ్ చాలా ధైర్యం చేసినట్టే. సినిమాలో కొన్ని సీన్స్ అయితే తమిళ హీరోలని మించి చేసాడు అని చెప్పొచ్చు. డాక్టర్ కాళ్ళు పట్టుకునే సీన్, హాస్పిటల్ లో సీన్, ముందు నుంచి అనుకున్నట్టే కాలు సీన్స్, ఢిల్లీలో చెరుకురసం బండి దగ్గర పనిచేసే సీన్స్,ఇక కుస్తీ పోటీల్లో మట్టిలో, బురదలో పోరాడటం.. అసలు ఇవన్నీ ఓ తెలుగు స్టార్ హీరో చేసాడు అంటే చాలా మంది నమ్మలేరు. కానీ రామ్ చరణ్ చేసాడు. చేసి ప్రేక్షకులను ఏడిపించాడు.
అసలు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఆ కాలు కు సంబంధించిన సీన్ అయితే చూడలేము, ఒళ్ళు గగుర్పుడుస్తుంది, కన్నీళ్లు వస్తాయి. ఒక స్టార్ హీరో అయి ఉండి అలాంటి సీన్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. మరి తమిళ హీరోలని పొగిడే తెలుగు సోషల్ మీడియా మేధావులు ఇప్పుడు రామ్ చరణ్ ని పొగుడుతారా, అతని నటనని, తమిళ హీరోలకు మించి అతను చేసిన పర్ఫార్మెన్స్ ని అభినందిస్తారా చూడాలి. ఫ్యాన్ వార్స్ తో ఎప్పుడూ పక్క సినీ పరిశ్రమల సినిమాలను నెత్తికెక్కించుకునే తెలుగు నెటిజన్లు రామ్ చరణ్ పెద్ది సినిమాని ప్రమోట్ చేస్తారా? ఇలాంటి కంటెంట్ సినిమాని, స్ఫూర్తినిచ్చే సినిమాని పొగుడుతారా చూడాలి మరి.
Also Read : Peddi Review : ‘పెద్ది’ మూవీ రివ్యూ.. రామ్ చరణ్ ఏడిపించేశాడుగా.. చరణ్ ధైర్యానికి హ్యాట్సాఫ్..
ఇప్పటికి కూడా తెలుగు సినిమా, తెలుగు స్టార్ హీరో నటనని పొగిడి, దానికి గుర్తింపు రాకపోతే ఇకపై వేరే ఏ స్టార్ హీరో కూడా ధైర్యం చేసి ఇలాంటి కథలు, అందరూ అనుకునే తమిళ సినిమా పర్ఫార్మెన్స్ లు చేయడానికి ముందుకు రారు. కమర్షియల్ సినిమాల మూసలోనే కొట్టుకుపోతారు. ఇప్పుడిప్పుడే తెలుగు పరిశ్రమ మారుతున్నా ఇంకా స్టార్ హీరోలు రొటీన్ కమర్షియల్ సినిమాలతోనే నడుస్తున్నా పెద్దిలో చరణ్ చేసిన సీన్స్ చేసే ధైర్యం మన హీరోలకు ఉందా అని ప్రశ్నించుకోవాల్సిందే.
ఇటీవల కళ్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో రిస్క్ చేసి ఓ కొత్త రకం క్లైమాక్స్ తో ఆశ్చర్యపరిచాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆ క్లైమాక్స్ గురించి అంతా మాట్లాడుకున్నారు. ఇప్పుడు చరణ్ పెద్ది సినిమా గురించి కూడా మాట్లాడుకోవాలి. మన స్టార్ హీరోలు కూడా తమిళ హీరోలని మించి ఎలాంటి పాత్రలు అయినా చేయగలరు అని నిరూపించాల్సిన టైం వచ్చింది. చరణ్ అలాంటి సీన్స్, పాత్ర చేయడమే కాదు ఈ సినిమాలో మూడు గేమ్స్ కోసం దానికి తగ్గట్టు తన బాడీని మార్చుకున్నాడు. అందుకోసం గొడ్డు కష్టపడినట్టు కష్టం పడ్డాడు. అసలు సినిమాలో చరణ్ బాడీ చూస్తే వామ్మో.. అంత బాడీ తీసుకురావడానికి చరణ్ ఎంత కష్టం పడ్డాడో అని ఆలోచించాల్సిందే.
Also See : Ram Charan HD Stills : ‘పెద్ది’ మూవీ రిలీజ్.. రామ్ చరణ్ HD స్టిల్స్..
ప్రతి సినిమాలోనూ కొన్ని నెగిటివ్ అంశాలు ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఐటెం సాంగ్, జాన్వీ కపూర్ సీన్స్ మైనస్ అవుతాయి. కానీ ఒక మంచి సినిమా, ఒక స్ఫూర్తినిచ్చే సినిమా వచ్చినప్పుడు ఆ కమర్షియల్ అంశాలు పక్కన పెట్టి సినిమాని నెగిటివ్ ప్రచారం చేసే యాంటీ ఫ్యాన్స్ కూడా సినిమాకు సపోర్ట్ చేసినప్పుడే ఇలాంటి మంచి సినిమాలు ఇంకా వస్తాయి. ఇప్పటికే పెద్ది హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు సమస్యలు, కష్టాలు ఉన్న టాలీవుడ్ కి పెద్ది సినిమా హిట్ అవసరం కూడా. ఈ ఒక్క సినిమా హిట్ అయి భారీ కలెక్షన్స్ వస్తే ఇంకో రెండు మూడు నెలలు టాలీవుడ్, థియేటర్స్ ఇండస్ట్రీ ప్రశాంతంగా ఉంటుంది.
10TV is a Telugu News and Current Affairs Channel owned by Spoorthi Communications Private Limited. Launched in March 2013, 10TV primarily caters to the Telugu TV audience in Telangana and Andhra Pradesh, with a strong news network in both states.
Copyright 2025 © Developed by Veegam Software Pvt Ltd.