
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే చందాదారులు సులభంగా సేవలు పొందేలా వాట్సప్ చాట్ బాట్‌ను తీసుకురానుంది. పీఎఫ్ డిజిటల్ సేవలను వినియోగదారులకు సులభంగా అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో వాట్సప్ నుంచే సులువుగా పీఎఫ్ సేవలు పొందవచ్చు. ఇందుకోసం పీఎఫ్ వెబ్ సైట్ లేదా ఉమాంగ్ యాప్ ప్రతీసారి తెరవాల్సిన పని ఉండదు. పీఎఫ్ సేవలను మరింత సౌకర్యవంతంగా మార్చాలనే ఉద్దేశంతో వాట్సప్ చాట్ బాట్ తీసుకొస్తున్నారు. ఇక పీఎఫ్ ఆఫీసులను సందర్శించాల్సిన అవసరాన్ని తగ్గించడం, ఫిర్యాదులను పరిష్కరించాన్ని వేగవంతం చేసేందుకు వాట్సప్ సేవలు ఉపయోగపడనున్నాయి.





