
ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం నేనండీ.. గుర్తున్నానా.. ఆమదాలవలస పట్టణంలో వంశధార కుడి కాలువకు అనుసంధానంగా 2.2 కి.మీ. పొడవున నన్ను నిర్మించారు. రూ.16.77 కోట్లు ఖర్చు పెట్టి కట్టి.. 2007లో ప్రారంభించారు. దాదాపు 19 ఏళ్లవుతోంది. ఆరోజు నుంచి ఈరోజు వరకు ఎవరూ పట్టించుకోలేదు. కనీస మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారు. ఇప్పుడేమో నా పరిస్థితి దయనీయంగా మారిపోయింది. రోజురోజుకూ శిథిలమవుతున్నాను. పెచ్చులూడిపోతూ ఓ పక్కకు ఒరిగిపోయాను. నీరు ఎక్కడికక్కడ లీకై వృథాగా పోతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఏ క్షణాన కూలిపోతానో అనిపిస్తోంది. అదే జరిగితే 40 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి కష్టాలొస్తాయి. ఇదంతా అధికారులకు తెలిసినా కనీసం తాత్కాలిక మరమ్మతులకూ ముందుకు రావట్లేదు. ఆ మధ్య ఐఐటీ మద్రాసు నుంచి కొందరు నిపుణులొచ్చి వెళ్లారు. ఎన్నేళ్లు గడిచిపోతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా ప్రతిపాదనలు పంపడమే తప్ప పనులు జరగట్లేదు. ‘ఇటీవల రూ.11.50 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి నివేదించామని, నిధులు మంజూరైన వెంటనే పనులు వేగవంతంగా చేపడతాం’ అని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ చెప్పారు. అదైనా త్వరగా జరిగితే బాగుండునని కోరుకుంటున్నాను. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





