
తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈసారి టీటీడీ ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటోంది. భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో కమ్య
తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈసారి టీటీడీ ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటోంది. భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేకమైన టెక్నాలజీలను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాలు, నెట్వర్క్ స్లైసింగ్ వంటి ఆధునిక పరికరాలను ఉపయోగించి భద్రతా వ్యవస్థను మరింత పటిష్ఠంగా మార్చడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ సంవత్సరం, మాడ వీధులలో 3.5 లక్షల మంది భక్తులు రానున్నారని టీటీడీ అంచనా వేస్తోంది. ఇలాంటి భారీ రద్దీ ఉన్నప్పుడు, సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడం, వాకీటాకీ ఫ్రీక్వెన్సీలు ఓవర్‌ల్యాప్ కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు, జియోతో కలిసి 'నెట్వర్క్ వితిన్ ది నెట్వర్క్' అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 30 అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను ఏర్పాటు చేశారు. సాధారణ సిగ్నల్స్ జామ్ అయినా, ఈ పరికరాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానమై పనిచేస్తాయి. 11 కీలక సబ్-కంట్రోల్ పాయింట్ల వద్ద ఉన్నతాధికారులకు వీటిని అందించనున్నారు.
భక్తుల రద్దీని అంచనా వేయడానికి, ఈసారి టీటీడీ ఏఐ ఆధారిత హెడ్ కౌంటింగ్ కెమెరాలను వినియోగిస్తోంది. దాదాపు 200 కెమెరాలను ఏర్పాటు చేసి, గ్యాలరీలను గ్రిడ్లుగా విభజించారు. ప్రతి గ్రిడ్‌లో ఉన్న భక్తుల సంఖ్యను ఈ కెమెరాలు రియల్ టైంలో లెక్కిస్తాయి. ఏదైనా గ్యాలరీ సామర్థ్యానికి మించి నిండిపోతే, వెంటనే అప్రమత్తమై భక్తులను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేందుకు ఇది దోహదపడుతుంది. తోపులాటలు నివారించేందుకు, కొత్త ఎగ్జిట్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. గ్యాలరీల నుంచి భక్తులు ఒకేసారి బయటకు వచ్చే సమయంలో తోపులాటలు జరగకుండా, దిశల వారీగా మార్గాలను నిర్దేశించారు. దక్షిణ మాడ వీధిలోని భక్తుల కోసం ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వారు నేరుగా ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి లేదా తిరుమల బస్టాండ్‌కు చేరుకోవచ్చు.




