
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Heavy Rains In Several Districts Of Ap Today: ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. మరికొన్ని జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. అయితే, తాజాగా.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక విషయాలను వెల్లడించింది. ఇవాళ ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో నేడు ఒకవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ద్రోణి ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలోని మొత్తం 46 మండలాల్లో తీవ్ర ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని.. 79 మండలాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. వర్షాలు పడే సమయంలో, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద ఉండొద్దని సూచించారు. ఇవాళ ఏపీలో వర్షాలతో పాటు పలు జిల్లాల్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఏలూరు, పోలవరం, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పలు
మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరికొన్ని మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Also Read: Special Trains: రైల్వే ప్రయాణికులకు భారీ ఊరట.. 132 ప్రత్యేక రైళ్ల సర్వీసు పొడిగింపు
Also Read: FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 జీ5, టీవీలో ఎలా చూడాలి? ప్లాన్ల ధరలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook