
Jagan Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెరపైకి తెచ్చిన ‘మావిగన్’ (MAVIGUN) కారిడార్ ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులంటూ కాలయాపన చేశారని, ఇప్పుడు వాటి కథ ముగిసిపోవడంతో సరికొత్తగా ‘మావిగన్’ అనే కొత్త రాగాన్ని అందుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మచిలిపట్నం (MA), విజయవాడ (VI), గుంటూరు (GUN) ప్రాంతాలను కలుపుతూ మూడు జిల్లాల పరిధిలో రాజధాని కారిడార్‌ను ఏర్పాటు చేస్తామనడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పవన్ ఆరోపించారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరిట ప్రజల నుంచి, రైతుల నుంచి విలువైన భూములను లాక్కునేందుకే ఈ సరికొత్త ప్లాన్‌ను జగన్ ప్రతిపాదించారని ఆయన విమర్శించారు. రాజధానిపై స్పష్టమైన విధానం లేకే ఇలాంటి అనాలోచిత ప్రతిపాదనలతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. Read Also : డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామంటూ వైఎస్ జగన్ భరోసా ఒక రాజధాని నగరం లేదా మెట్రోపాలిటన్ హబ్ అనేది రాత్రికి రాత్రే పుట్టుకురాదని, దానికి దశాబ్దాల ప్రణాళిక, నిరంతర శ్రమ అవసరమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ఉదాహరణగా చూపిస్తూ.. హైదరాబాద్ కానీ, నేటి ఐటీ హబ్ సైబరాబాద్ కానీ ఒకే రోజులోనో లేదా కొద్ది నెలల్లోనో అంతర్జాతీయ స్థాయికి ఎదగలేదని గుర్తుచేశారు. ఎంతో మంది విజనరీ నాయకుల కృషి వల్ల, దశాబ్దాలుగా సాగుతున్న నిర్మాణాల ఫలితంగానే నేడు సైబరాబాద్ ఆ స్థాయిలో నిలిచిందని, ఇప్పటికీ అక్కడ అభివృద్ధి, కొత్త నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు. అలాంటిది ఉనికిలో ఉన్న అమరావతిని కాదని, మూడు ప్రాంతాలను కలిపి సరికొత్త కారిడార్ అంటున్న జగన్ ఆలోచనలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని పవన్ దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అమరావతిని
ఏకైక రాజధానిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
Adulterated Ghee Case : కల్తీ నెయ్యి కేసులో పలు ప్రాంతాలలో ఈడీ సోదాలు
Heart health: ఆహారంలో చిన్న మార్పులతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
YogAndhra-2026: యోగాంధ్ర-2026: జూన్ 21న కోటి మందితో మెగా ఈవెంట్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Amaravati : తెలంగాణ లో నా అనే ఉనికి ఉంటె.. ఆంధ్ర లో నా అనే ఉనికి లేదు – పవన్
Kunamneni Sambasiva rao: పవన్ వ్యాఖ్యలపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు
YS Jagan: డీఎస్సీ అభ్యర్థులకు అండగా ఉంటామంటూ వైఎస్ జగన్ భరోసా
Telangana: తెలంగాణ మా అయ్యల జాగీరు.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై గద్దర్ కూతురు వెన్నెల ఫైర్
Andhra Pradesh Rains: రానున్న ఐదు రోజులు ఏపీకి వర్ష సూచన
ఎల్‌నినో ఎఫెక్ట్ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ...
మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు పరిసర జిల్లాల్లో గత ఆదివారం నుండి రుతుపవన పూర్వ (Pre-Monsoon)...
తెలంగాణ రాజకీయాల్లో కాంట్రాక్టులు, ప్రాంతీయ అంశాలపై సరికొత్త వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్టర్లకు తెలంగాణలో...
హైదరాబాద్‌లో లోన్ యాప్ వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. నగరంలోని ఐటీ హబ్ ఐకాన్...
ముదివర్తిపాలెంలో ఘోరం, తిరునాళ్ల ముగించుకొని వస్తుండగా ఇద్దరు యువకులపై విచక్షణారహితంగా దాడి చేసిన గుర్తుతెలియని దుండగులు,...
హైదరాబాద్‌లో జనసేన అంతర్గత సభకు అనుమతి నిరాకరణ, ఆపై హైకోర్టులోనూ హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణకు...
బుధవారం ఉదయం ఢిల్లీలోని మాల్వీయా నగర్ ప్రాంతంలో ఒక రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో కనీసం...
ఇంగ్లాండ్ వేసవి సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఎదురైన ఘోర పరాజయం తర్వాత...
తిరుమల యాత్రికులకు స్వచ్ఛమైన ఆహారం అందించడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది....
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ (Sambhal) జిల్లాలో జరిగిన ఒక అత్యంత క్రూరమైన, సంచలనమైన యాసిడ్ దాడి కేసులో...
© 1997–2026 AGA Publications Limited. All rights reserved.