
ప్రయోగాలు చేయడంలో సిద్ధహస్తుడు హీరో సూర్య (Suriya). ఎవరూ ట్రై చేయని కథలను తీసుకొని.. వాటితో హిట్ కొట్టడం ఆయనకు అలవాటు. ప్రయోగాలు చేయడంలో సిద్ధహస్తుడు హీరో సూర్య (Suriya).
Home » South Cinema » Tamil » Suriya to Play Iconic Real-Life Doctor Thiruvengadam in His Next Mega Biopic rp
ప్రయోగాలు చేయడంలో సిద్ధహస్తుడు హీరో సూర్య (Suriya). ఎవరూ ట్రై చేయని కథలను తీసుకొని.. వాటితో హిట్ కొట్టడం ఆయనకు అలవాటు.
ప్రయోగాలు చేయడంలో సిద్ధహస్తుడు హీరో సూర్య (Suriya). ఎవరూ ట్రై చేయని కథలను తీసుకొని.. వాటితో హిట్ కొట్టడం ఆయనకు అలవాటు. అయితే వాటిలో కొన్ని పరాజయాలను అందుకున్నా.. ప్రయోగాలను చేయడం మాత్రం ఆయన వదులుకోలేదు. ఇక ఈ ఏడాది కరుప్పు (Karuppu) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సూర్య తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం.
ఇప్పటికే సూర్య తెలుగులో విశ్వనాథ్ అండ్ సన్స్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత డైరెక్టర్ టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో జై భీమ్ లాంటి భారీ హిట్ సినిమా వచ్చింది. అయితే అది ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో సెట్స్ మీదకు వెళ్ళనుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఒక బయోపిక్ అని తెలుస్తోంది.
చెన్నై వ్యాసార్పాడికి చెందిన డాక్టర్ తిరువేంగడం తెలుగువారికి కూడా సుపరిచితమే. పేద ప్రజల కోసం కేవలం రూ. 2 నుండి రూ. 5 లకే వైద్యం అందించారు. మెడిసిన్ రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో గౌరవించింది. ఆరేళ్ళ క్రితం ఆయన మరణించారు. ఇప్పుడు ఆ లెజండరీ వైద్యుడు బయోపిక్ ని ప్రేక్షకులకు చూపించాలన్న ఉద్దేశ్యంతో టీజీ జ్ఞానవేల్ - సూర్య కలిసి ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ బయోపిక్ తో సూర్య మరో హిట్ ని అందుకుంటాడా అనేది చూడాలి.