
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌లో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌కు నిదర్శమని హైదరాబాద్‌లో పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం ఆంధ్రాకు వెళ్లి రోజా ఇంట్లో రొయ్యల పులుసు న్యూఢిల్లీ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌లో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌కు నిదర్శమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ సభలకు, అర్బన్ నక్సలైట్ల సభలకు మాత్రం రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇస్తుందని ఆయన విమర్శించారు.
తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకల అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు. పవన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆప్రజాస్వామికంగా వ్యవహరించింది. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే కార్యక్రమాన్ని ప్రభుత్వ అడ్డుకోవడం ఏమిటి?
తెలంగాణలో పాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక.. కేసీఆర్ ఏపీకి వెళ్లి మాజీ మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నప్పుడు తెలంగాణ సెంటిమెంటు ఏమైందని కల్వకుంట్ల కవితను బీజేపి ఎంపీ రఘునందర్ రావు ప్రశ్నించారు.
రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న సమయంలో కేసీఆర్ పక్కనే కవిత ఉంది కదా? అని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లు వేరే రాష్ట్రాలకు వెళ్లి ఎన్నికల వెళ్లి ప్రచారం చేయలేదా? అని నిలదీశారు. ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పుకునే కాంగ్రె్‌సకు..
సీఎం రేవంత్‌కు.. పవన్ హైదరాబాద్‌లో సభ పెట్టుకుంటే వచ్చిన ఇబ్బంది ఏంటని ధ్వజమెత్తారు. ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా? చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్
Home » National » Pawan Kalyan Hyderabad Sabha Permission Denied BJP Emergency Mindset Allegation
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌లో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌కు నిదర్శమని
హైదరాబాద్‌లో పవన్ సభకు అనుమతి ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం
ఆంధ్రాకు వెళ్లి రోజా ఇంట్లో రొయ్యల పులుసు
న్యూఢిల్లీ, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు హైదరాబాద్‌లో బహిరంగ సభ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ మైండ్‌సెట్‌కు నిదర్శమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ సభలకు, అర్బన్ నక్సలైట్ల సభలకు మాత్రం రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ భవన్లో రాష్ట్ర అవతరణ వేడుకల అనంతరం రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు. పవన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆప్రజాస్వామికంగా వ్యవహరించింది. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించే కార్యక్రమాన్ని ప్రభుత్వ అడ్డుకోవడం ఏమిటి? తెలంగాణలో పాలన ప్రజాస్వామ్యబద్ధంగా సాగాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక.. కేసీఆర్ ఏపీకి వెళ్లి మాజీ మంత్రి రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్నప్పుడు తెలంగాణ సెంటిమెంటు ఏమైందని కల్వకుంట్ల కవితను బీజేపి ఎంపీ రఘునందర్ రావు ప్రశ్నించారు. రోజా ఇంట్లో రొయ్యల పులుసు తిన్న సమయంలో కేసీఆర్ పక్కనే కవిత ఉంది కదా? అని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌లు వేరే రాష్ట్రాలకు వెళ్లి ఎన్నికల వెళ్లి ప్రచారం చేయలేదా? అని నిలదీశారు. ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పుకునే కాంగ్రె్‌సకు.. సీఎం రేవంత్‌కు.. పవన్ హైదరాబాద్‌లో సభ పెట్టుకుంటే వచ్చిన ఇబ్బంది ఏంటని ధ్వజమెత్తారు.
ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?
చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...