
మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి భారీ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్, జూన్ 18: మైనార్టీల సామాజిక, ఆర్థిక, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి భారీ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో మైనార్టీ సంక్షేమ పనుల పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్షను ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..
ఉర్దూ అకాడమీ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముషాయిరాలు నిర్వహిస్తామని అన్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో భారీ ముషాయిరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే 20 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల ప్రారంభానికి సిద్ధం చేస్తున్నామన్నారు.
నిర్మాణంలో మరో 17 పాఠశాలలను ఉన్నాయని చెప్పారు. వాటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్ భవనాల పనులకు టైమ్ క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాజీవ్ యువ వికాసం ద్వారా మైనార్టీ యువతకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి రూ.50 కోట్లు కేటాయింపులు చేసినట్లు వివరించారు. వక్ఫ్ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మైనార్టీల శ్మశాన వాటికల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
కొత్త శ్మశాన వాటికల కోసం భూముల సేకరించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్లను ఆదేశించామని అన్నారు. ఈ శ్మశాన వాటికల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. వ్యక్తిగత సమస్యలు పార్టీపై రుద్ద వద్దు: నేతలకు మల్లు రవి సూచన ఆక్వా రంగాన్ని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే: సీఎం చంద్రబాబు