
నేరేడు పండులో చాలా పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా మాంగనీస్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. క్యాన్సర్ నిరోధించే గుణం కూడా వీటిలో ఉంది.
నేరేడు పండులో చాలా పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా మాంగనీస్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. క్యాన్సర్ నిరోధించే గుణం కూడా వీటిలో ఉంది.
నేరేడు పండు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఈ పండులో జాంబోలిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది షుగర్ లెవల్స్‌ను తగ్గించి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.
నేరేడు పండు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు తగ్గుతాయి. డయాబెటిస్ వల్ల తరచుగా మూత్రవిసర్జన, దాహం వంటి సమస్యలు వస్తాయి. నేరేడు పండు తింటే ఈ లక్షణాలు కంట్రోల్ అవుతాయి.
విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల నేరేడు పండు హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. ఈ పండులో ఉండే ఐరన్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది.
ఈ నేరేడు పండు తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. ఇందులో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.
నేరేడు పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ధమనుల పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం వంటి వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
Natu Kodi Curry: నాటుకోడి వండినప్పుడు ఇలా చేస్తే నోట్లోనే కరిగిపోతుంది, రుచి కూడా డబుల్
Fish Storage: చేపలు ఎన్ని రోజులు ఫ్రిడ్జ్ లో ఉంటే సేఫ్?
Sweet potato: రోజుకి ఒక చిలగడ దుంప తింటే ఏమౌతుందో తెలుసా?
Walnuts: రోజూ నానపెట్టిన వాల్ నట్స్ తింటే ఏమౌతుందో తెలుసా?