ముఖంపై ఏర్పడిన రంధ్రాలను తొలగించడంలో ఐస్ క్యూబ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుందని డెర్మటాలజీ అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికోసం శుభ్రమైన క్లాత్‌లో ఐస్ ముక్కలు చుట్టి దానితో ముఖంపై మసాజ్ చేయండి.
ముఖంపై ఏర్పడిన రంధ్రాలను తొలగించడంలో ఐస్ క్యూబ్ థెరపీ చాలా బాగా పనిచేస్తుందని డెర్మటాలజీ అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికోసం శుభ్రమైన క్లాత్‌లో ఐస్ ముక్కలు చుట్టి దానితో ముఖంపై మసాజ్ చేయండి. దీంతో రంధ్రాలు మూసుకుపోతాయి. అలాగే స్కిన్ క్లియర్‌గా మారుతుంది.
ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో ఒకట్రెండు సార్లు చేస్తే ముఖంపైన రంధ్రాలు మూసుకుపోతాయి.
గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై రంధ్రాలు తొలగించి మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతాయి. దీనికోసం గ్రీన్ టీ తయారుచేసి చల్లారిన తర్వాత అందులో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిపి కాటన్ బాల్ సహాయంతో ముఖానికి రాసుకోండి. కాసేపయ్యా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
శనగ పిండి నేచురల్ ఎక్స్ఫోలియేట్ లాగా పనిచేసి ముఖ రంధ్రాలను తొలగిస్తుంది. దీనికోసం శనగ పిండిలో కొద్దిగా పెరుగు, ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి రాసుకోండి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.
అలోవెరాలోని సమ్మేళనాలు ముఖంపై రంధ్రాలు, మొటిమలు, మచ్చలు తొలగించడంలో సహాయపడతాయి. దీనికోసం తాజా అలోవెరా తీసుకుని ముఖానికి మందపాటి లేయర్ లాగా రాసుకోండి. 20 నిమిషాలు ఉంచి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
టొమాటోల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మంపై అదనపు నూనెలు తొలగించి ముఖంపై రంధ్రాలు తొలగిస్తాయి. దీనికోసం తాజా టొమాటో గుజ్జును ముఖానికి రాసుకుని కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే చాలు.
ముఖంపై రంధ్రాలు తొలగించడంలో కోడిగుడ్డు తెల్లసొన చాలా బాగా పనిచేస్తుంది. దీనికోసం ఒక కోడిగుడ్డు తెల్లసొనను బాగా గిలకొట్టి ముఖంపై మందపాటి లేయర్ లాగా రాసుకోండి. ఆరిన తర్వాత క్లీన్ చేసకుంటే సరిపోతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ నేచురల్ టోనర్‌గా పనిచేసి ముఖంపై రంధ్రాలను తొలగిస్తుంది. దీనికోసం వెనిగర్, నీళ్లు సమపాళ్లలో కలిపి ఫేష్ వాష్ చేసుకున్నాక టోనర్ లాగా అప్లై చేస్తే సరిపోతుంది.
ముఖంపై రంధ్రాలు ఉన్నవారు వాటర్ ఎక్కువగా తాగడం మంచిది. అలాగే ఎండ నుంచి రక్షణ కోసం సన్‌స్క్రీన్ రాసుకోండి. పాల ఉత్పత్తులు, షుగర్, నూనె ఎక్కువగా ఉన్న పదార్థాలు తినకండి. ఇవి సెబమ్ ఉత్పత్తి పెంచి రంధ్రాలు పెద్దగా కనపడేలా చేస్తాయి.